టెస్లా అధినేత ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగంలో మరో కీలక అస్ డేట్ వచ్చింది. ఈ ప్రయోగం గతంలో విఫలమైన తరువాత ఎలన్ మస్క్ మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని తెలిపారు. తాజాగా జరిగిన ఫ్లైట్-2 ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించినట్లు తన ట్విట్టర్ ఖాతాలో ఎలన్ మస్క్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించి టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లో షిప్ 25 సిక్స్ ఇంజిన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ పూర్తి చేసుకున్నదని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.
Read Also: Taliban Rule: తాలిబన్ పాలనలో పౌరుల మరణాలు పెరిగాయి.. ఐరాస ఆందోళన
గత ఏప్రిల్‌లో ఎలన్ మస్క్ సారధ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. అమెరికాలోని టెక్సాస్ సమీపంలోగల బోకా చీకా తీరం నుంచి నింగిలోకి ఎగిసిన కొద్దిసేపటికే రాకెట్ స్టార్‌షిప్ పేలిపోయింది. ఈ రాకెట్ ప్రయోగం విఫలమమైన నేపథ్యంలో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ పేర్కొంది. అయితే అప్పుడు ఎలన్ మస్క్ ఒక ట్వీట్‌లో ఈ ప్రయోగ ఫలితాలను తమ సైంటిస్టులు పరిశీలిస్తారన్నారు. ఈ వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకుని.. మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపట్టనున్నట్లు మస్క్ తెలిపారు.
Read Also: Rajamouli: వెకేషన్ లో ఉన్నారు.. వదిలేయండయ్యా
అంతరిక్షంలో వ్యోమగాములు, సరుకు రవాణాకు ఉద్దేశించిన స్టార్‌షిప్ ప్రయోగాన్ని గత ఏప్రిల్ 17న చేపట్టారు. ఈ ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి.. మెక్సికోలో పడేలా దాన్ని రూపొందించారు. అయితే స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగించినా.. సాంకేతిక కారణాలతో చివ నిమిషాలంలో ప్రయోగం క్యాన్సిల్ అయింది. తర్వాత ప్రయోగంలో ఊహించని విధంగా స్టార్‌షిప్ రాకెట్ విఫలమైంది. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో మరోమైలు రాయి దాటినట్లు ఎలన్ మస్క్ వెల్లడించాడు.
Ship 25 completes a six-engine static fire test at Starbase in Texas pic.twitter.com/wCCrh0RRNA
— SpaceX (@SpaceX) June 27, 2023