Jio Unlimited 5G Data: టెలికాం దిగ్గజలలో ఒకటైన రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఒక సరికొత్త, సరసమైన డేటా బూస్టర్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 15 ధరతో 24 గంటల పాటు అపరిమిత 5G ఇంటర్నెట్ సేవలను అందించే షార్ట్-టర్మ్ డేటా ప్యాక్‌ను ప్రకటించింది. ఈ సింగిల్ డే యాడ్ ఆన్ ప్లాన్ నవంబర్ 5 నుండి అర్హులైన ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకవచ్చింది.
ఎక్కువ కాలపరిమితి ఉండే నెలవారీ లేదా వారపు రీఛార్జ్ ప్లాన్లతో సంబంధం లేకుండా.. తాత్కాలికంగా అత్యధిక స్పీడ్ ఇంటర్నెట్ అవసరమైన యూజర్లను దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్యాక్‌ను రూపొందించింది. తమ ట్రూ 5G స్టాండ్అలోన్ (SA) నెట్వర్క్ ద్వారా ఎలాంటి స్పీడ్ పరిమితులు లేకుండా అన్లిమిటెడ్ డేటాను అందించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. హెవీ గేమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ పనుల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ ప్లాన్ ద్వారా లభించే కీలక ప్రయోజనాలు
4K వీడియో స్ట్రీమింగ్:
ఎలాంటి బఫరింగ్ లేకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అల్ట్రా-హై-డెఫినిషన్ (4K) కంటెంట్, లైవ్ స్పోర్ట్స్ మ్యాచ్‌లు, వీడియోలను వీక్షించవచ్చు.
తక్కువ లేటెన్సీతో ఆన్లైన్ గేమింగ్:
పోటీతత్వంతో కూడిన ఆన్లైన్ మల్టీప్లేయర్ మొబైల్ గేమింగ్ కోసం తక్కువ పింగ్ రేట్, అత్యుత్తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
భారీ ఫైల్ ట్రాన్స్ఫర్స్ & క్లౌడ్ బ్యాకప్‌లు:
హై-స్పీడ్ అప్‌లింక్ ద్వారా క్లౌడ్ బ్యాకప్‌లు, సిస్టమ్ అప్డేట్లు, పెద్ద సైజు మీడియా ఫైళ్లను క్షణాల్లో అప్లోడ్ చేయవచ్చు.
మొబైల్ హాట్‌స్పాట్ & రిమోట్ వర్క్:
మొబైల్ హాట్‌స్పాట్ (టెథరింగ్) ఫీచర్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లకు కనెక్ట్ చేసుకుని వర్క్ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు సులువుగా నిర్వహించుకోవచ్చు.
భారీ ఫైల్ డౌన్లోడ్స్:
గేమింగ్ ఇన్స్టాలేషన్ ఫైళ్లు, సాఫ్ట్వేర్ అప్డేట్లు, భారీ మీడియా ఫైళ్లను అపరిమితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
యూజర్లు ఈ రూ. 15 డేటా బూస్టర్ ప్యాక్‌ను MyJio యాప్, జియో అధికారిక వెబ్సైట్ లేదా గుర్తింపు పొందిన థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల (Google Pay, PhonePe, Paytm వంటివి) ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ అపరిమిత 5G డేటా సేవలను పొందడానికి యూజర్ వద్ద తప్పనిసరిగా 5G స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే వారు నివసించే ప్రాంతం జియో ట్రూ 5G నెట్వర్క్ పరిధిలో ఉండటంతో పాటు సిమ్‌లో ఏదైనా ఒక యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అమల్లో ఉండటం తప్పనిసరి.

