Site icon NTV Telugu

ఇంట్లోనే థియేటర్ సౌండ్ అనుభవం.. 250W డాల్బీ ఆడియోతో JBL Cinema SB560 పై ఏకంగా రూ.11000 భారీ డిస్కౌంట్..!

Jbl Cinema Sb560

Jbl Cinema Sb560

JBL Cinema SB560: ఇంట్లోనే థియేటర్ స్థాయి సౌండ్ కోరుకునే వినియోగదారుల కోసం JBL కంపెనీకి చెందిన Cinema SB560 Dolby Audio Soundbar బెస్ట్ ఆప్షన్ గా చూడవచ్చు. హోం థియేటర్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సౌండ్ సిస్టమ్‌గా ఇది నిలుస్తోంది. ఈ సౌండ్ బార్ ఏకంగా 250W భారీ ఆడియో అవుట్‌పుట్‌తో పాటు వైర్‌లెస్ సబ్‌వూఫర్‌ను కలిగి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితోపాటు 3.1 చానల్ సెటప్, క్లియర్ వాయిస్ క్లారిటీ కోసం ప్రత్యేక సెంటర్ చానల్, అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ లభిస్తాయి.

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఏడాదిపాటు ‘Microsoft 365 Personal’, ‘Copilot’ ఫీచర్లు ఉచితం..!

ఈ సౌండ్ బార్ లో 12 అంగుళాల వైర్‌లెస్ సబ్‌వూఫర్ ఉండటం వల్ల డీప్ బాస్ అవుట్‌పుట్ అద్భుతంగా లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా కూడా JBL Cinema SB560 అత్యంత అనుకూలంగా ఉంది. Bluetooth 5.4 సపోర్ట్‌తో 10 మీటర్ల వరకు వైర్‌లెస్ కనెక్టివిటీ పొందవచ్చు. అలాగే HDMI eARC సపోర్ట్ ఉండటం వల్ల టీవీ నుంచి సౌండ్ బార్ కు హై-క్వాలిటీ ఆడియో ట్రాన్స్‌మిషన్ సులభంగా జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, టీవీ వంటి పరికరాలతో కనెక్షన్ కూడా చాలా సులభంగా పొందవచ్చు.

X Chat: వాట్సాప్‌కు దీటుగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో ఎక్స్ (X) కొత్త ‘చాట్’ ఫీచర్..!

ఇక డిజైన్ విషయానికి వచ్చితే స్టైలిష్ బార్ సిరీస్ డిజైన్‌తో ఈ సౌండ్ బార్ ఆధునిక లుక్‌ను అందిస్తుంది. వాల్ మౌంట్ సపోర్ట్ కూడా ఉండడంతో మీరు టీవీకి కింద గానీ గోడపై గానీ సులభంగా అమర్చవచ్చు. బ్లాక్ కలర్‌లో లభించే ఈ సౌండ్ బార్ ప్రీమియం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బాక్స్‌లో సౌండ్ బార్, వైర్‌లెస్ సబ్‌వూఫర్, రిమోట్ కంట్రోల్, HDMI కేబుల్, వాల్ మౌంట్ బ్రాకెట్ సెటప్ లభిస్తుంది. దీనికి కంపెనీ లిమిటెడ్ వారంటీ అందిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. ఈ JBL Cinema SB560 సౌండ్ బార్ అసలు ధర రూ.25,999 కాగా ప్రస్తుతం -42% భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.14,999కు అందుబాటులో ఉంది. అంతేకాదు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు EMI ట్రాన్సాక్షన్‌పై వినియోగదారులకు మరో 7.5% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ.1,000 వరకు) లభిస్తుంది.

Exit mobile version