Site icon NTV Telugu

Jacob & Co’s Vantara: “ఇది వాచ్ కాదు.. కళాఖండం”.. అనంత్ అంబానీ రూ.13.7 కోట్ల వాచ్‌ స్పెషాలిటీ ఇదే..

Ananth Anbani

Ananth Anbani

Jacob & Co’s Vantara Watch: వాచ్‌ అంటే చాలామందికి కేవలం సమయం చూపించే వస్తువే. కానీ కొన్ని వాచ్‌లు సమయంతో పాటు ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి. అలాంటి ప్రత్యేక వాచ్ జాకబ్ అండ్ కో రూపొందించిన “ఓపెరా వంటారా గ్రీన్ కామో”. ఈ లగ్జరీ వాచ్‌కు ప్రేరణ ఇచ్చింది ఎవరో కాదు.. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ. అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్‌లంటే చాలా ఇష్టం. తన దుస్తులకు తగ్గట్టు వాచ్‌లను స్టైల్ చేయడమే కాదు, తన పెళ్లి సమయంలో స్నేహితులకు విలువైన వాచ్‌లను బహుమతిగాఇచ్చారు. అలాంటి వాచ్ ప్రేమికుడి కోసం.. జాకబ్ అండ్ కో కంపెనీ ప్రత్యేకంగా ఈ వాచ్‌ను రూపొందించింది.

READ MORE: Union Budget 2026: మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది? ఆ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా?

ఈ వాచ్ పేరు “వంటారా”. గుజరాత్‌లో ఉన్న వంటారా గ్లోబల్ వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అండ్ కన్సర్వేషన్ సెంటర్‌ను గుర్తు చేస్తూ ఈ పేరు పెట్టారు. జంతువుల సంరక్షణ కోసం అనంత్ అంబానీ చేస్తున్న కృషికి ఇది ఒక గౌరవ సూచకం. ఈ వాచ్ డయల్‌ని చూస్తే అది ఒక చిన్న అడవిలా అనిపిస్తుంది. ఆకుపచ్చ రంగులో కామోఫ్లాజ్ డిజైన్, దానిపై విలువైన రాళ్లు మెరిసిపోతుంటాయి. డయల్ మధ్యలో చేతితో పెయింట్ చేసిన అనంత్ అంబానీ చిన్న విగ్రహం ఉంటుంది. అది ఈ మొత్తం ఈ వాచ్‌కు కేంద్ర బిందువులా ఉంటుంది. ఆయన పక్కన ఒక సింహం, మరోవైపు ఒక బెంగాల్ టైగర్ కనిపిస్తాయి. ఇవి భారతదేశ వన్యప్రాణుల శక్తిని, అందాన్ని చూపిస్తాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ వాచ్ బెల్ట్‌ను ఏనుగు తొండం మాదిరిగా తయారు చేశారు. మొత్తం డిజైన్ అంతా విలువైన రత్నాలతో తయారు చేశారు. ఆకుపచ్చగా మెరిసే డెమాంటాయిడ్ గార్నెట్లు, ఆకుపచ్చ రంగు ఇచ్చే ట్సావొరైట్స్, మృదువైన రంగు మార్పులు చూపించే గ్రీన్ సఫైర్లు, వాటికి తోడుగా తెల్ల వజ్రాలు.. ఇలా మొత్తం 397 రత్నాలు ఈ వాచ్‌లో ఉన్నాయి. వీటి బరువు దాదాపు 22 క్యారెట్లు.

READ MORE: Ramdas Athawale: ఆ పని చేస్తే ఎక్కువ నిధులు ఇస్తాం.. సీఎం పినరయి విజయన్‌కు ఎన్డీయే ఆఫర్..

ఈ వాచ్ ధరను కంపెనీ అధికారికంగా చెప్పలేదు. కానీ కొన్ని వార్తల ప్రకారం దీని ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు 13.7 కోట్ల రూపాయలు) ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే.. ఇది కేవలం వాచ్ కాదు.. ఒక కళాఖండం. జాకబ్ అండ్ కో స్థాపకుడు జాకబ్ అరాబోకి ఇలాంటి ఇలాంటి ప్రత్యేక డిజైన్లు చేయడం అంటే చాలా ఇష్టం. “ఇప్పటివరకు ఎవరు చేయని పనులు చేయడమే నా కల” అని ఆయన చెబుతారు. అందుకే ఆయన వాచ్‌లు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ బ్రాండ్‌ను సల్మాన్ ఖాన్, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, రిహానా లాంటి ప్రముఖులు కూడా ఇష్టపడతారు. ఇలాంటి కొత్త డిజైన్‌లతో వాచ్‌లు తయారు చేయడం ఆయనకు కొత్త కాదు.. ఇంతకుముందు కూడా జాకబ్ అండ్ కో రామ్ జన్మభూమి ప్రత్యేక ఎడిషన్ వాచ్‌ను రూపొందించారు. ఆ వాచ్‌ను అనంత్ అంబానీ, అభిషేక్ బచ్చన్ లాంటి వారు ధరించారు.

Exit mobile version