Site icon NTV Telugu

iQOO Z11 Turbo vs RedMagic 11 Air: ఏ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ బెస్ట్..?

Iqoo Z11 Turbo Vs Redmagic 11 Air

Iqoo Z11 Turbo Vs Redmagic 11 Air

iQOO Z11 Turbo vs RedMagic 11 Air: రోజువారీ వినియోగంలో ఏ ఫ్లాగ్‌షిప్ అనుభవం మీ అవసరాలకు సరిపోతుందనేదని చాలామందికి అసలు ప్రశ్న. ఒక ఫోన్ పూర్తిగా గేమింగ్ ఎండ్యూరెన్స్, స్టేబుల్ పెర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేయబడితే, మరొకటి వేగం, కెమెరాలు, బ్యాటరీ లైఫ్ అన్నిటికీ బ్యాలెన్స్ ఇస్తూ తక్కువ ధరలో వాల్యూ అందించేందుకు ప్రయత్నిస్తోంది. రెండూ పవర్ యూజర్లనే టార్గెట్ చేస్తుండగా ఐక్వూ Z11 టర్బో, రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ మధ్య ఏది బెస్ట్ మొబైల్ లో చూద్దాం.

డిజైన్:
రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ పూర్తిగా గేమింగ్ ఐడెంటిటీతో ముందుకు వస్తుంది. RGB లైటింగ్, ప్రెజర్-సెన్సిటివ్ షోల్డర్ కంట్రోల్స్, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ వంటి ఫీచర్లు చూస్తే ఇది ఒక మొబైల్ గేమింగ్ మెషీన్ అని వెంటనే అర్థమవుతుంది. ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ దీన్ని బోల్డ్‌గా, మెకానికల్ ఫీల్‌తో చూపిస్తాయి. ఇంకా ఎక్కువ గేమింగ్ సెషన్లకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఐక్వూ Z11 టర్బో మాత్రం మరింత క్లిన్, రిఫైన్డ్ డిజైన్‌ను అందిస్తుంది. బెటర్ వాటర్ రెసిస్టెన్స్, అండర్‌స్టేటెడ్ లుక్ వల్ల ఇది రోజువారీ ఉపయోగానికి మరింత వర్సటైల్‌గా అనిపిస్తుంది. గేమర్ లుక్ లేకుండానే ఫ్లాగ్‌షిప్ ఫీల్ కావాలనుకునేవాళ్లకు ఐక్వూ డిజైన్ నచ్చుతుంది.

డిస్‌ప్లే:
రెండూ మొబైల్స్ హై రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానెల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే రెడ్ మ్యాజిక్ డిస్‌ప్లే గేమింగ్‌కు ట్యూన్ చేయబడింది. స్టేబుల్ బ్రైట్‌నెస్, స్మూత్ మోషన్, ఫాస్ట్ టచ్ రెస్పాన్స్ గేమ్ ప్లే సమయంలో కంట్రోల్, ప్రెడిక్టబుల్ అనుభవాన్ని ఇస్తాయి. అయితే ఐక్వూ మాత్రం డిస్‌ప్లేలో బ్రైట్‌నెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. అత్యధిక పీక్ బ్రైట్‌నెస్, మెరుగైన HDR, అడ్వాన్స్‌డ్ PWM డిమ్మింగ్ వల్ల అవుట్‌డోర్ వినియోగం, వీడియో స్ట్రీమింగ్‌లో ఇది ఎక్కువగా ఆకట్టుకుంటుంది. రెడ్‌మ్యాజిక్ డిస్‌ప్లే గేమింగ్‌కు స్థిరంగా అనిపిస్తే, ఐక్వూ డిస్‌ప్లే సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది.

పెర్ఫార్మెన్స్‌:
రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్లో ఉన్న Snapdragon 8 Elite ప్రాసెసర్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌తో కలిసి లాంగ్ గేమింగ్ సెషన్లలో కూడా థ్రాట్లింగ్ లేకుండా స్టేబుల్‌గా పనిచేస్తుంది. గేమర్లకు ఇది పెద్ద ప్లస్. మరోవైపు iQOO Z11 టర్బోలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉంది. ఇది కొంచెం తక్కువ అగ్రెసివ్ అయినప్పటికీ డైలీ యూజ్, మల్టీటాస్కింగ్‌లో చాలా స్మూత్, ఎఫిషియంట్‌గా ఉంటుంది. ఫ్యాన్ లేకపోయినా థర్మల్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది. రెడ్ మ్యాజిక్ పూర్తిగా పవర్ చూపిస్తే iQOO స్మార్ట్ ఆప్టిమైజేషన్‌తో సాగుతుంది.

బ్యాటరీ:
ఈ విషయంలో iQOO Z11 Turbo 7600 mah తో స్పష్టంగా ముందంజలో ఉంటుంది. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌తో పాటు రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది రోజంతా నిరంతర వినియోగానికి సరిపోతుంది. RedMagic మాత్రం బైపాస్ చార్జింగ్ అనే ప్రత్యేక ఫీచర్‌తో 7,000mAh డ్యూయల్-సెల్ బ్యాటరీతో గేమర్లను ఆకట్టుకుంటుంది. గేమ్ ఆడుతూ చార్జింగ్ చేసినా హీట్ తగ్గేలా ఇది సహాయపడుతుంది. ఛార్జింగ్ స్పీడ్ పరంగా రెండూ బాగానే ఉన్నా iQOO బ్యాటరీ లైఫ్‌పై ఫోకస్ చేస్తే, RedMagic పవర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడుతుంది.

కెమెరా:
ఇందులో కూడా iQOO Z11 టర్బోతో 200MP OIS కెమెరాలో స్పష్టంగా పైచేయి సాధిస్తుంది. OIS ఉన్న హై-రిజల్యూషన్ మెయిన్ కెమెరా, మెరుగైన కలర్ అక్యురసీ వల్ల వివిధ లైటింగ్ కండిషన్లలో కూడా ఫోటోలు షార్ప్‌గా వస్తాయి. మరోవైపు RedMagic లో 50MP OIS సరైన ఫలితాలు ఇస్తాయిగానీ.. అవి గేమింగ్ అనుభవానికి సపోర్ట్ చేసే స్థాయిలోనే ఉంటాయి. అల్ట్రా వైడ్ కెమెరా రెండు ఫోన్లలో సమానంగానే ఉన్నా ప్రాసెసింగ్‌లో iQOO ఎక్కువగా కన్సిస్టెంట్‌గా ఉంటుంది.


ధర:
ధర విషయానికి వస్తే RedMagic 11 Air సుమారు రూ.48000 ధరతో మార్కెట్లోకి వస్తుంది. యాక్టివ్ కూలింగ్, షోల్డర్ కంట్రోల్స్ వంటి స్పెషలైజ్డ్ హార్డ్‌వేర్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఇది గేమింగ్ కు సరైన ధరగా భావించవచ్చు. iQOO Z11 Turbo మాత్రం సుమారు రూ. 37000 వద్ద లభిస్తుంది. తక్కువ ధరలోనే బలమైన పెర్ఫార్మెన్స్, మెరుగైన కెమెరాలు, బ్రైట్ డిస్‌ప్లే, ఎక్కువ డ్యూరబిలిటీ అందించడం వల్ల ఇది వాల్యూ ఫర్ మనీగా నిలుస్తుంది.

మొత్తంగా చూస్తే.. RedMagic 11 Air ఒక పోర్టబుల్ గేమింగ్ కన్సోల్‌లా అనిపిస్తుంది. దీర్ఘ గేమింగ్ సెషన్లకు కావాల్సిన అన్ని ప్రత్యేక ఫీచర్లతో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. iQOO Z11 టర్బో మాత్రం అన్ని పనులూ నమ్మకంగా చేసే ఒక బ్యాలెన్స్‌డ్ ఫ్లాగ్‌షిప్‌గా కనిపిస్తుంది. గేమింగ్‌నే ప్రధానంగా చూసేవాళ్లకు రెడ్ మ్యాజిక్ సరైన ఎంపిక అయితే, కెమెరాలు, బ్యాటరీ, డిస్‌ప్లే, వాల్యూ అన్నిటినీ బ్యాలెన్స్‌గా కోరుకునేవాళ్లకు iQOO Z11 టర్బో ఉత్తమ ఎంపిక.

Exit mobile version