iQOO Z10 Turbo Pro+: 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, IP65 రేటింగ్ తో సంచనాలను సృష్టించడానికి సిద్దమైన ఐక్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z10 Turbo Pro+: ఆగస్టు 7న iQOO Z10 Turbo Pro+ చైనాలో గ్లోబల్ లాంచ్ కాబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే వచ్చిన రూమర్లను నిజం చేస్తూ.. iQOO ఈ ఫోన్‌లో మిడియాటెక్ Dimensity 9400+ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్టు కన్ఫర్మ్ చేసింది. ప్రత్యేకతగా ఇందులో 8000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఇది హై-పెర్ఫార్మెన్స్ ఫోన్లలో అతి పెద్దది కానుంది. దీని ద్వారా అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ ను వాగ్దానం చేస్తోంది కంపెనీ.
త్వరలో విడుదల కానున్న iQOO Z10 Turbo Pro+ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. 6.78 అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ ఫుల్ స్క్రీన్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఇది చైనాలో అత్యంత బ్రైట్ నెస్ ఇచ్చే స్క్రీన్‌గా పేర్కొనబడుతోంది. ఇందులో in-house అభివృద్ధి చేసిన Q2 గేమింగ్ చిప్ ఉంటుంది. దీని వల్ల గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు

ఇక ఈ మొబైల్ లో 8000mAh భారీ బ్యాటరీతో ఇది మార్కెట్‌లో ఉన్న ఇతర ఫోన్ల కంటే ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. నివేదిక ప్రకారం ఈ భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ మందంలో చాలా తక్కువ పెరగల మాత్రమే ఉంది. ఇది ముందు విడుదలైన Turbo Pro (8.09mm) కంటే పెద్దగా ఉండదు. ఇక కెమెరా, ఇతర ఫీచర్లు (Turbo Pro వేరియంట్ ఆధారంగా) చూసినట్లయితే ఇందులో.. 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో రానుంది. అలాగే 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా అందించనున్నారు. అలాగే ఇందులో IP65 రేటింగ్ వల్ల పొడి, నీటి చుక్కల నుండి రక్షణ లనిస్తుంది.

Digital Arrest Scam: స్కామర్లకు మహిళా వైద్యురాలు బలి.. రూ.19 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు!
ఈ కొత్త మొబైల్ తో పాటు TWS, పవర్‌బ్యాంక్ కూడా లాంచ్ కానుంది. semi-in-ear నాయిస్ క్యాన్సలేషన్ ఇయర్ బడ్స్ గా iQOO TWS Air3 Pro లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనితోపాటు iQOO 22.5W 10,000mAh పవర్ బ్యాంక్ కూడా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. ఇది అతీ తక్కువ బరువు, పల్చని డిజైన్తో వస్తుంది.

అలాగే ఇన్-బిల్ట్ కేబుల్ కలిగి ఉంటుంది. iQOO Z10 Turbo Pro+ ఒక పవర్‌ఫుల్ గేమింగ్ + లాంగ్ బ్యాటరీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు, భారత మార్కెట్‌లో లాంచ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!