iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్ డేట్ ఫిక్స్.. 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా

  • iQOO Neo 12లో 2K OLED స్క్రీన్, 100W ఛార్జింగ్?
  • పూర్తి వివరాలు ఇవే
Iqoo Neo 12

Iqoo Neo 12

iQOO Neo 12 Launching October 28?: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గేమింగ్, పనితీరుకు ప్రాధాన్యత ఇచ్చే యూజర్లను లక్ష్యంగా చేసుకుని iQOO Neo 12 రానున్నట్లు సమాచారం. అక్టోబర్ 28న చైనాలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లీకైన వివరాల ప్రకారం ఇందులో 2K OLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 200MP కెమెరా, భారీ 9,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండవచ్చని తెలుస్తోంది.

లీక్ ప్రకారం iQOO Neo 12లో 6.89 అంగుళాల 2K OLED డిస్‌ప్లే ఉండవచ్చని సమాచారం. ఈ స్క్రీన్ 185Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఇది 3nm తయారీ ప్రక్రియపై ఆధారపడిన చిప్‌గా పేర్కొంటున్నారు. దీనికి LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ జత కావచ్చని సమాచారం. గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక iQOO Q3 గ్రాఫిక్స్ చిప్‌ను కూడా అందించవచ్చని ప్రచారం జరుగుతోంది. చైనాలో ఎంపిక చేసిన 50 గేమ్‌లకు 185 FPS సపోర్ట్ ఉంటుందని లీక్ పేర్కొంటోంది.

కెమెరా విభాగంలో కూడా iQOO Neo 12 ఆకట్టుకునే ఫీచర్లతో రావచ్చని సమాచారం. లీకైన వివరాల ప్రకారం ఇందులో ఈ కెమెరాలు ఉండవచ్చు:
200MP మెయిన్ కెమెరా
50MP అల్ట్రా-వైడ్ కెమెరా
32MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా

ఇందులో ఏకంగా 9,000mAh బ్యాటరీని అందించవచ్చని సమాచారం. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని తెలుస్తోంది. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, X-axis లీనియర్ మోటార్, మెటల్ ఫ్రేమ్, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ Android 17 ఆధారిత OriginOS 7తో రావచ్చని లీకులు పేర్కొంటున్నాయి.