ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆపిల్ వాచ్, ఐఫోన్ లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆపిల్ నుంచి రిలీజ్ అయ్యే న్యూ గాడ్జెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. ఆపిల్ ఐఫోన్ కొనేందుకు స్టోర్ల వద్ద బారులు తీరుతుంటారు. కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలని వెయిట్ చేస్తుంటారు. అయితే ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు ఆలోచిస్తుంటారు. ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇక మీరు ఆఫర్ల కోసం చూడాల్సిన పనిలేదు. ఎందుకంటే చౌక ధరలో ఐఫోన్ వచ్చేస్తోంది. ఐఫోన్ లవర్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఆపిల్ త్వరలో చౌక ధరలో ఐ ఫోన్ ను రిలీజ్ చేయబోతోంది. iPhone SE 4 పేరుతో త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. పలు నివేదికల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆపిల్ యొక్క ఈ చౌకైన ఐఫోన్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని ప్రకటించలేదు. కానీ, తాజాగా iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. iPhone SE 4 ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో, ఫోన్ ముందు ప్యానెల్ డిజైన్ iPhone 15 లాగా కనిపిస్తుంది. అంటే డైనమిక్ ఐలాండ్ డిస్‌ప్లేను iPhone SE లో కూడా అందించబోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ SE 4లో A18 లేదా A17 ప్రో బయోనిక్ చిప్‌ని అమర్చనున్నట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లే, ఫేస్ ID ఫీచర్లతో రానున్నట్లు సమాచారం. Apple iPhone SE 4లో బెజెల్-లెస్ డిజైన్‌తో డిస్‌ప్లేను పొందుతారు. iPhone SE 4 వెనుక భాగంలో సింగిల్ కెమెరాను అందించనున్నారు. ఇందులో కంపెనీ 48MP ప్రైమరీ కెమెరాను అందించనుంది. ఫోన్ బ్యాటరీ నుంచి ఇతర హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లను కూడా iPhone SE 4లో చూడొచ్చంటు నివేదికలు చెప్తున్నాయి. చౌక ధరలో రానున్న iPhone SE 4 ధర రూ. 40 నుంచి 45 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తక్కువ ధరలోనే ఐఫోన్ వచ్చేస్తుండడంతో ఐఫోన్ లవర్స్ ఎగిరి గంతేస్తున్నారు.
First look at the iPhone SE 4 Dummy pic.twitter.com/qL0COgmPPA
— Sonny Dickson (@SonnyDickson) January 16, 2025