iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.. యూస్ నుంచి ఈజీగా ‘ఐఫోన్ 17’ తెచ్చేసుకోవచ్చు!
- యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త
- యూస్ నుంచి ఈజీగా ఐఫోన్ తెచ్చేసుకోవచ్చు
- కొనుగోలు మరింత చౌకగా, టెన్షన్ లేకుండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాపిల్ ‘ఐఫోన్’ ప్రేమికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. కస్టమ్స్ రూల్స్ 2026లో చేసిన తాజా మార్పులతో ఇప్పుడు అమెరికా నుంచి ఐఫోన్ 17 (iPhone 17)ను భారత్‌కు తీసుకురావడం మరింత సులభంగా మారింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ నిబంధనలు పెద్ద ఊరట కలిగించనున్నాయి.
కొత్త కస్టమ్స్ రూల్స్ ప్రకారం.. ప్రయాణికులు డ్యూటీ ఫ్రీగా తీసుకురాగలిగే వస్తువుల విలువను రూ.75,000 వరకు పెంచారు. గతంతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల అనే చెప్పాలి. అమెరికాలో తక్కువ ధరకు లభించే ఐఫోన్లను కొనుగోలు చేసి.. భారత్‌కు తీసుకురావడం ఇప్పుడు లాభదాయకంగా మారింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక ల్యాప్‌టాప్‌ను డ్యూటీ ఫ్రీగా భారత్‌కు తీసుకురావడానికి అనుమతి ఉంది. దాంతో స్టూడెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్‌తో పాటు తరచుగా విదేశాలకు ప్రయాణించే వారికి భారీ ప్రయోజనం కలగనుంది.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
Also Read:
ఇంతకుముందు భారత్‌కు ఖరీదైన గాడ్జెట్లు తీసుకొస్తే.. అదనపు కస్టమ్స్ డ్యూటీ విధించే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ తాజా నిబంధనలతో హైఎండ్ స్మార్ట్ఫోన్లు, ప్రీమియం గాడ్జెట్లపై అదనపు కస్టమ్స్ వసూలు చేసే అవకాశం గణనీయంగా తగ్గింది. దీంతో ఐఫోన్ 17 లాంటి ఫ్లాగ్షిప్ ఫోన్లను సులభంగా తీసుకురావచ్చు. అమెరికాలో ఐఫోన్ ధరలు భారత్‌తో పోలిస్తే తక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కస్టమ్స్ నిబంధనల సడలింపుతో తాజా మోడల్ ఐఫోన్ 17 కొనుగోలు మరింత చౌకగా, టెన్షన్ లేకుండా తీసుకురావడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, విదేశాల నుంచి వచ్చే బంధువుల ద్వారా ఐఫోన్ తెప్పించుకునేవారికి ఇది నిజంగా డబుల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!