Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
- ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20
- 5,200mAh బ్యాటరీ
- ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20లో పంచ్-హోల్ డిస్ప్లే
- ఫోన్ మందం కేవలం 7.7 మిల్లీమీటర్లు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ స్మార్ట్ఫోన్ల విభాగంలో మరో కొత్త ఫోన్‌ను తీసుకురావడానికి ఇన్ఫినిక్స్ సిద్ధమైంది. కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20ను జూన్ 8న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ కావడంతో పలు కీలక ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి.
జూన్ 8న లాంచ్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 స్మార్ట్‌ఫోన్ జూన్ 8న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. క్లౌడ్‌లైన్ బ్లూ, పోలారిస్ టైటానియం, షాడో బ్లాక్, సన్‌లైట్ ఆరెంజ్ అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్స్ లో ఇది అందుబాటులోకి రానుంది.
Also Read
- Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
- Apple Health AI App: ChatGPTకి పోటీగా Apple కొత్త AI హెల్త్ యాప్.. వైద్య పరిశోధనలతో ఆరోగ్య సమస్యలకు సమాధానాలు!
- Nvidia CEO Comeback: Nvidia CEOగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ? ఎలాన్ మస్క్ మద్దతు.. మళ్లీ పగ్గాలు చేపడతారా?
- Asus ExpertBook A7: ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ A7 లాంచ్.. 8GB RAM, OLED డిస్ప్లే, 24 గంటల బ్యాటరీ!
లిస్టింగ్ ప్రకారం, ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌ను అందించారు. అలాగే 3D టెక్స్చర్డ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంటుంది.
అంచనా ఫీచర్లు
మైక్రోసైట్ వివరాల ప్రకారం, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20లో పంచ్-హోల్ డిస్ప్లే ఇవ్వనున్నారు. ఫోన్ మందం కేవలం 7.7 మిల్లీమీటర్లు మాత్రమే ఉండనుంది. పనితీరు విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 4GB ర్యామ్‌తో పాటు మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ విస్తరించుకునే సదుపాయం లభించనుంది.
అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో కూడిన 6.78 అంగుళాల డిస్ప్లేను అందించే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5,200mAh బ్యాటరీని అందించనున్నారు. ఈ బ్యాటరీ 15W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని సమాచారం. ఇక IP64 రేటింగ్‌తో ఈ ఫోన్ నీరు, ధూళి నుంచి రక్షణ పొందనుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ఫీచర్లు
గత సంవత్సరం విడుదలైన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 భారత మార్కెట్లో రూ.6,799 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో వచ్చింది. ఇందులో 6.67 అంగుళాల HD+ డిస్ప్లే, యూనిసోక్ T7250 ప్రాసెసర్, 8MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 5,000mAh బ్యాటరీతో పాటు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!