Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్‌ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ

  • ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్
  • MediaTek Dimensity 7100 ప్రాసెసర్
  • ప్రత్యేక ఆకర్షణగా సెకండరీ LED డిస్‌ప్లే
Infinix Hot 70 Pro

Infinix Hot 70 Pro

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Infinix Hot 70 Proను గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీ, MediaTek Dimensity 7100 ప్రాసెసర్, అలాగే ప్రత్యేకమైన సెకండరీ LED డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. Infinix Hot 70 Proను కంపెనీ మొత్తం ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. నైట్ పల్స్, డైవ్ బ్లూ, డెప్త్ రింగ్ వైట్, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్, థర్మో ఆరెంజ్. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

144Hz డిస్‌ప్లేతో స్మూత్ అనుభవం

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.76 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 2344 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్తో పాటు 950 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అంతేకాకుండా, 45Hz నుంచి 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో గేమింగ్, స్క్రోలింగ్, వీడియో వీక్షణ మరింత స్మూత్‌గా ఉంటుంది.

MediaTek Dimensity 7100 ప్రాసెసర్

పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7100 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 8GB LPDDR4X RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను జత చేశారు. రోజువారీ పనులతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు కూడా ఈ ఫోన్ మంచి పనితీరు అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ప్రత్యేక ఆకర్షణగా సెకండరీ LED డిస్‌ప్లే

Infinix Hot 70 Proలో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత Active Matrix Cube LED Display. వెనుక భాగంలో మూడో కెమెరా లెన్స్ స్థానంలో ఈ చిన్న LED డిస్‌ప్లేను అమర్చారు. ఇది నోటిఫికేషన్లు, కాల్స్, ఛార్జింగ్ స్టేటస్ వంటి సమాచారాన్ని చూపించగలదు.

50MP సోనీ కెమెరా

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ కెమెరాను అందించారు. దీనికి అదనంగా ఒక సపోర్టింగ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీను అందించారు. దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌తో పాటు తక్కువ సమయంలోనే ఛార్జింగ్ పూర్తవుతుంది.

Android 16తో దీర్ఘకాలిక అప్‌డేట్లు

Infinix Hot 70 Pro Android 16 ఆధారిత XOS 16పై పనిచేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు 3 ప్రధాన Android OS అప్‌డేట్లు (Android 19 వరకు), 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు (2031 వరకు) అందిస్తామని హామీ ఇచ్చింది.