NTV Telugu Site icon

Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు

Tech

Tech

Technology: భారతదేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 92,000 పేటెంట్‌ రైట్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇది సాంకేతిక, శాస్త్రీయ అభివృద్ధికి కేంద్రంగా భారత్‌లో పెరుగుతున్న మేధస్సుకు సూచిక అని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్స్‌ ఉన్నత్‌ పండిట్‌ పేర్కొన్నారు. భారత్‌లో ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ ఐపీ రక్షణను కోరుతోందని అసోచాం సదస్సులో వెల్లడించారు. మేధో సంపత్తి (ఐపీ) హక్కులకు సంబంధించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నట్లు.. అలాగే, కొత్త రూల్స్ కోసం వివిధ వాటాదారుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.

Read Also: Karnataka Politics: అధికార మార్పిడిపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

కాగా, వివిధ రంగాలలో ఐపీ రక్షణ కోసం రూపొందించిన మార్గదర్శకాలను పునరుద్ధరించేందుకు కసరత్తు కొనసాగుతుందని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్స్‌ ఉన్నత్‌ పండిట్‌ చెప్పుకొచ్చారు. అలాంటి, గైడ్ లైన్స్ ను మరింత బలోపేతం చేసేందుకు పరిశ్రమలు, ఐపీ వాటాదారులు కూడా సహకారం అందించొచ్చని వెల్లడించారు. ఐపీ హక్కుల వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమర్థవంతమైన ఐపీ ఫైలింగ్‌ల దిశగా తాము పని చేస్తున్నాం.. మంజూరైన పేటెంట్లలో ఈ వేగవంతమైన పెరుగుదల కనిపిస్తుంది.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అనేక ఆవిష్కరణలతో పేటెంట్ రైట్స్ కోసం దరఖాస్తులు చేసే వారి సంఖ్య క్రమంగా పెరగడాన్ని ఇది ప్రతిబింబిస్తోందని ఉన్నత్‌ పండిట్‌ తెలిపారు.

Show comments