NTV Telugu Site icon

Tech Tips: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా?.. వీటి ఉపయోగం ఏంటో తెలుసా?

App

App

గూగుల్ ప్లే స్టోర్ లో రకరకాల యాప్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటుంటారు. ఈ యాప్స్ సాయంతో వారి పనులు ఈజీ అవుతాయి. ఆన్ లైన్ చెల్లింపుల యాప్స్ మొదలుకొని.. డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకునే యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పౌర సేవల కోసం ప్రభుత్వాలు కూడా యాప్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లో ఆయా యాప్స్ ను ఉంచుకోవడం వల్ల అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులకు ఉపయోగపడేలా కొన్ని యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీరు జరిమానాల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఆ యాప్స్ ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

DigiLocker

డిజీలాకర్ యాప్ మీ ఫోన్ లో ఉన్నట్లైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, బీమా వంటి పత్రాలను భద్రపర్చుకోవచ్చు. ప్రయాణ సమయంలో మీ వెంట ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోయినప్పటికీ డిజీలాకర్ లో స్టోర్ చేసుకుంటే ట్రాఫిక్ పోలీసులు అడిగిన వెంటనే చూపించొచ్చు. దీంతో మీరు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. ఇది ప్రభుత్వానికి చెందిన అధికారిక యాప్ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు.

mParivahan

ఈ యాప్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఇందులో కూడా మీ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మీరు RC, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, బీమా పత్రాలను భద్రపర్చుకోవచ్చు. ఇది కాకుండా, మీ వాహనం చోరీకి గురైనా లేదా ఇతరుల వాహనం గురించి మీకు సమాచారం కావాలంటే దీని ద్వారా తెలుసుకోవచ్చు. యాప్ Android, iOS రెండింటిలో అందుబాటులో ఉంది.