ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుతమైన అనుభూతులను అందిస్తుంది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సావాన్ని జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. మరో 4 రోజుల్లో వాలెంటైన్స్ డే రాబోతోంది. ఇప్పటికే యూత్ అంతా వాలెంటైన్స్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తమకు ఇష్టమైన వారి కోసం అదిరిపోయే గిఫ్ట్స్ అందించి సర్ ప్రైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి మీరు కూడా మీ లవర్ కి స్మార్ట్ గాడ్జెట్స్ గిఫ్ట్ గా ఇచ్చి స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్ లు తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.
Also Read:Allu Aravind: చరణ్ నా కొడుకు లాంటోడు.. ఇక్కడితో ఆపేయండి!
Fire-Boltt Ninja Talk:
మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కు తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఫైర్ బోల్ట్ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ వాచ్ Fire-Boltt Ninja Talk అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 11,999గా ఉంది. 90 శాతం డిస్కౌంట్ తో రూ. 1,199కే సొంతం చేసుకోవచ్చు. 1.39 అంగుళాల TFT రౌండ్ డిస్ప్లేతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు కు సపోర్ట్ చేస్తుంది. 120+ స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ ఫీచర్లతో వస్తుంది.
Realme Buds T310:Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బ్రతుకులు రోడ్డున పడ్డాయి
వాలెంటైన్స్ డేను మరింత స్పెషల్ గా మార్చుకునేందుకు ఇయర్ బడ్స్ ను గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే రియల్ మీ బ్రాండ్ కు చెందిన Realme Buds T310 బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వీటిపై 50 శాతం తగ్గింపు లభిస్తోంది. వీటి అసలు ధర రూ. 3999గా ఉంది. ఆఫర్లో భాగంగా మీరు రూ. 1999కే సొంతం చేసుకోవచ్చు. 40 గంటల ప్లే బ్యాక్ టైమ్ తో వస్తుంది. హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ను కలిగి ఉంది.
Also Read:
Motorola g45 5G:
స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే మోటరోలాకు చెందిన స్మార్ట్ ఫోన్ ట్రై చేయండి. బడ్జెట్ ధరలోనే Motorola g45 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో దీని అసలు ధర రూ. 14999గా ఉంది. 20 శాతం డిస్కౌంట్ తో రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. దీనిలో డాల్బీ అట్మోస్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్‌సెట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్‌తో కూడిన 6.5-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది.