NTV Telugu Site icon

SAMSUNG Galaxy F05: రూ. 10 వేల స్మార్ట్ ఫోన్ రూ. 6 వేలకే.. త్వరపడండి

Samsung Galaxy F05

Samsung Galaxy F05

మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సామ్ సంగ్ మొబైల్ పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. రూ. 10 వేల స్మార్ట్ ఫోన్ రూ. 6 వేలకే వచ్చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో SAMSUNG Galaxy F05 ఫోన్ పై 35 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 9,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 6,499కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసి కొనుగోలు చేస్తే మరింత తక్కువకే వచ్చేస్తోంది.

Also Read:Miss World: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు..

SAMSUNG Galaxy F05 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే, 60Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5 OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్‌, 64GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ట్విలైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read:Kerala Twins: ‘జీన్స్’ సీన్ రిపీట్.. కవల సోదరుల్ని పెళ్లి చేసుకున్న కవల సోదరీమణులు

SAMSUNG Galaxy F05 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది.