Site icon NTV Telugu

Realme P1 5G: క్రేజీ ఆఫర్.. రూ. 21 వేల రియల్ మీ 5G ఫోన్ రూ. 13 వేలకే!

Realme

Realme

లేటెస్ట్ ఫీచర్స్ తో న్యూ మొబైల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అప్ డేటెడ్ వర్షన్లతో బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈకామర్స్ సంస్థలు సైతం ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. రియల్ మీ బ్రాండ్ కు చెందిన Realme P1 5Gపై క్రేజీ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. రూ. 21 వేల ఫోన్ కేవలం రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్ కార్ట్ లో Realme P1 5Gపై 33 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ. 20,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 13,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరో రూ. 1000 తగ్గింపుతో వస్తుంది. అంటే మీరు ఈ ఫోన్ ను రూ. 12,999కే దక్కించుకోవచ్చు. రియల్‌మీ పీ1 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తో వస్తుంది.

రియల్‌మీ పీ1 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది.రియల్ మీ పీ1 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 45 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది.

Exit mobile version