స్మార్ట్ గాడ్జెట్స్ వాడకం ఎక్కువై పోయింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ స్మార్ట్ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎక్కువగా వాడే స్టార్ట్ గాడ్జెట్స్ లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఉంటున్నాయి. ఇయర్ బడ్స్ లేకుండా ఉండలేకపోతున్నారు మొబైల్ యూజర్లు. బ్రాండెడ్ కంపెనీ ఇయర్ బడ్స్ కూడా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. మీరు కూడా కొత్త ఇయర్ బడ్స్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది.
బౌల్ట్ బ్రాండ్ కు చెందిన Boult Z40 Pro ఇయర్ బడ్స్ పై 78 శాతం తగ్గింపు లభిస్తోంది. క్రేజీ ఫీచర్లతో వస్తున్న ఈ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1200కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో మాన్యుమెంటల్ సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో భాగంగా Boult Z40 Pro ఇయర్ బడ్స్ ను చౌక ధరకే అందిస్తోంది. వీటి అసలు ధర రూ. 5499గా ఉంది. ఆఫర్లో భాగంగా వీటిని మీరు రూ. 1199కే సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో కూడిన ఇయర్ బడ్స్ కావాలనుకునే వారు వీటిని ట్రై చేయొచ్చు.
ఈ ఇయర్ బడ్స్ 100 గంటల ప్లే టైమ్ తో వస్తున్నాయి. Quad Mic ENCతో క్రిస్టల్ క్లియర్ కాలింగ్ ను కలిగి ఉంది. ఎంతటి శబ్ధంలోనైనా క్వాలిటీ వాయిస్ ను వినొచ్చు. స్క్రాచ్ ప్రూఫ్, రబ్బర్ గ్రిప్ డిజైన్, 5.3v బ్లూటూత్ ఫీచర్లతో వస్తుంది. అదిరిపోయే సౌండ్ కోసం 13mm బేస్ డ్రైవర్స్ ను అందించారు. డ్యుయల్ టోన్ రబ్బరైస్ కేస్ తో వస్తుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కావాలనుకునే వారు ఈ ఆఫర్ ను వదులుకోకండి.