HP OmniPad 12: హెచ్‌పీ (HP) భారత మార్కెట్లో కొత్త ఓమిని ప్యాడ్ 12 (OmniPad 12) ట్యాబ్లెట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. విద్యార్థులు, మొదటిసారి ట్యాబ్లెట్ కొనుగోలు చేసే వినియోగదారులు, MSMEలు, యువ ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ట్యాబ్లెట్.. డిటాచబుల్ కీబోర్డ్‌తో వస్తోంది. అంతేకాకుండా iPrep (iDream Education), Lexillion (StudyMatix), Brands.live వంటి విద్యా, స్కిల్లింగ్ యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్ చేసి అందిస్తున్నారు.
2K 90Hz డిస్‌ప్లే:
ఈ కొత్త HP OmniPad 12లో 12 అంగుళాల 2K (2000 × 1200 పిక్సెల్స్) మల్టీ-టచ్ డిస్‌ప్లే ఉంది. 16:10 ఆస్పెక్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 400 నిట్స్ బ్రైట్‌నెస్, 100% sRGB కలర్ గామట్ సపోర్ట్‌తో మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ట్యాబ్లెట్‌కు Qualcomm Snapdragon 6 Gen 3 చిప్‌సెట్ శక్తినిస్తుంది. దీనికి Adreno GPU, 8GB LPDDR5 RAM, 128GB లేదా 256GB UFS స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. అవసరమైతే microSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.
బ్యాటరీ, కెమెరా:
HP OmniPad 12లో 31Wh బ్యాటరీ ఉండగా.. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 18 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. HP ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ సాయంతో 0 నుంచి 90% వరకు సుమారు 90 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఆడియో కోసం DTS:X అల్ట్రా సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్లు, డ్యూయల్ హై-SNR మైక్రోఫోన్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.
కనెక్టివిటీ పరంగా Wi-Fi 6E, Bluetooth 5.2, USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. అలాగే EPEAT సిల్వర్, ఎనర్జీ స్టార్ సర్టిఫికేషన్లు పొందింది. రీసైకిల్ చేసిన అల్యూమినియం, పర్యావరణహిత మెటీరియల్స్‌తో దీన్ని తయారు చేశారు.
ధర:
ట్యాబ్లెట్ 128GB వేరియంట్ ధర రూ. 48,999 కాగా, 256GB వేరియంట్ ధర రూ. 54,999గా నిర్ణయించారు. ఈ ట్యాబ్లెట్ డెనిమ్ బ్లూ, మేటర్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. HP ఆన్లైన్ స్టోర్ తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, HP వరల్డ్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా.. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే రూ. 96,000 విలువైన ఒక సంవత్సరం AI సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో GPT-5, క్లాడ్ 4, జెమినీ 2.5, పెర్ప్లేక్సిటీ, గ్రోక్ 4, డీప్ సీక్ వంటి ప్రముఖ AI సేవలకు యాక్సెస్ లభిస్తుంది.
HP OmniPad 12 ముఖ్య స్పెసిఫికేషన్స్:
* డిస్‌ప్లే: 12-అంగుళాల 2K (2000 × 1200), 90Hz, 400 నిట్స్, 100% sRGB
* ప్రాసెసర్: Qualcomm Snapdragon 6 Gen 3
* GPU: Adreno GPU
* RAM: 8GB LPDDR5
* స్టోరేజ్: 128GB / 256GB UFS, microSD ద్వారా 1TB వరకు విస్తరణ
* OS: Android 16
* రియర్ కెమెరా: 13MP
* ఫ్రంట్ కెమెరా: 8MP
* ఆడియో: DTS:X Ultraతో క్వాడ్ స్పీకర్లు
* కనెక్టివిటీ: Wi-Fi 6E, Bluetooth 5.2, USB Type-C
* బ్యాటరీ: 31Wh, 18 గంటల బ్యాకప్, HP Fast Charge
* బరువు: ట్యాబ్లెట్ 600 గ్రా.

