Google Account Security: ఇప్పుడు దేనికైనా గూగుల్ చేస్తున్నారు.. చివరకు కొత్త స్మార్ట్‌ఫోన్ ఆన్ చేసి లాగిన్ కావాలన్నా జీమెయిల్ కావాల్సిందే.. అయితే, మీ Google ఖాతా కేవలం ఒక లాగిన్ మాత్రమే కాదు.. అది మీ Gmail, Photos, Drive, YouTube వంటి వ్యక్తిగత డేటాకు గేట్‌వే. ఎవరైనా అనధికారికంగా యాక్సెస్ పొందితే, మీ సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో గూగుల్ ఖాతాలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు వంటి అనేక పరికరాల్లో ఉపయోగిస్తారు. అందుకే మీ ఖాతా ఎక్కడెక్కడ లాగిన్ అయి ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎలా చెక్ చేయాలి?
బ్రౌజర్‌లో myaccount.google.com ఓపెన్ చేయండి.. మీ Google ఖాతాతో లాగిన్ అవ్వండి.. Security (భద్రత) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. అక్కడ Your Devices / Manage Devices అనే విభాగాన్ని ఎంచుకోండి. ఇప్పుడు మీ ఖాతా లాగిన్ అయిన పరికరాల జాబితా కనిపిస్తుంది.
ఇక్కడ ఏమి చూడవచ్చు అంటే..?
– పరికరం రకం (ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్)
– సుమారు స్థానం
– చివరి యాక్టివిటీ టైమ్ చూసుకోవచ్చు..
అంటే మీకు తెలియని పరికరం కనిపిస్తే, వెంటనే ఆ పరికరంపై క్లిక్ చేసి Sign Out చేయండి. ఇక, అదనపు భద్రత కోసం వెంటనే మీ పాస్‌వర్డ్ మార్చండి.. Two-Step Verification (2FA) ఆన్ చేయండి.. రికవరీ ఫోన్ నంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేసుకోండి.. మీ Google ఖాతా భద్రతను క్రమం తప్పకుండా చెక్ చేయడం ద్వారా సైబర్ మోసాల నుండి రక్షించుకోవచ్చు.
