Site icon NTV Telugu

రూ.13 వేలకే 10,000mAh బ్యాటరీ, 6.81 అంగుళాల 1.5K డిస్‌ప్లే.. Honor X80 స్పెక్స్ ఇవే!

Honor X8

Honor X8

Honor X80: హానర్ సంస్థ తన X-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ Honor X80పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలో త్వరలోనే ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు టాక్. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. ముఖ్యంగా, ఈ ఫోన్‌లో భారీ 10,000mAh బ్యాటరీ ఉండనున్నట్లు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, Honor X80 ధర సుమారు CNY 1,000 (భారత కరెన్సీలో దాదాపు రూ.13,000)గా ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో ఇంత పెద్ద బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ వస్తుండటం మార్కెట్‌లో 2026 చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది.

Read Also: Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు..

Honor X80 కీలక స్పెసిఫికేషన్లు..
* బ్యాటరీ: భారీ 10,000mAh
* డిస్‌ప్లే: 6.81 అంగుళాల LTPS స్క్రీన్
* రిజల్యూషన్: 1.5K
* ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్
* Honor X70కి అప్‌గ్రేడ్‌గా Honor X80

అయితే, గతేడాది జూలై 2025లో చైనాలో విడుదలైన Honor X70కి సక్సెస్ ఫుల్ గా మార్కెట్‌లోకి రానుంది.

Honor X70 స్పెసిఫికేషన్లు
* 6.79 అంగుళాల 1.5K డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్
* స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్
* 12GB RAM, 512GB స్టోరేజ్
* 8,300mAh బ్యాటరీ
* 80W ఫాస్ట్ ఛార్జింగ్
* 50MP రియర్ కెమెరా
* 8MP ఫ్రంట్ కెమెరా

ఈ స్పెసిఫికేషన్లతో పోలిస్తే, Honor X80లో బ్యాటరీ సామర్థ్యం భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం Honor X80కు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే, బడ్జెట్ సెగ్మెంట్‌లో భారీ బ్యాటరీతో హానర్ కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version