Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor త్వరలో భారీ బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. కంపెనీ కొత్తగా Honor X80 ను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ కొత్త మోడల్ గత ఏడాది విడుదలైన Honor X70కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. గతంలో వచ్చిన Honor X70లో 8,300mAh బ్యాటరీ ఉండగా, ఇప్పుడు Honor X80లో మరింత భారీ 10,000mAh బ్యాటరీను అందించనున్నట్లు తెలుస్తోంది.
జూన్‌లో లాంచ్ అయ్యే అవకాశం
Also Read
- iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
లీక్ సమాచారం ప్రకారం, Honor X80 జూన్ 10 నుంచి 20 మధ్యలో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన Honor X80i తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న రెండో ఫోన్ ఇదే. ఈ వివరాలు చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో ద్వారా వెలుగులోకి వచ్చాయి.
10,000mAh భారీ బ్యాటరీ హైలైట్
Honor X80లో ప్రధాన ఆకర్షణగా 10,000mAh భారీ బ్యాటరీ ఉండనుందని సమాచారం. అలాగే, ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుందని అంచనా. అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్‌కు షాక్-రెసిస్టెంట్ బాడీ డిజైన్‌ను కూడా అందించే అవకాశం ఉంది. దీంతో ఫోన్ మరింత బలంగా, మన్నికగా ఉండనుంది.
డిస్ప్లే ఫీచర్లు
ఈ ఫోన్లో 6.8 అంగుళాల LTPO OLED డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. డిస్ప్లే గరిష్టంగా 6000 నిట్స్ బ్రైట్నెస్ను అందించనున్నట్లు లీక్ సమాచారం చెబుతోంది.
ప్రాసెసర్, కెమెరా వివరాలు
Honor X80లో క్వాల్కామ్ మిడ్-రేంజ్ చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఫోన్ Snapdragon 6 Gen 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని అంచనా.
కెమెరాల విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G, 4G, Wi-Fi, Bluetooth వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి.
అలాగే, ఈ ఫోన్‌ను:
మిస్టిక్ బ్లాక్
మూన్లైట్ వైట్
లైట్నింగ్ రెడ్
వైబ్రెంట్ ఆరెంజ్ రంగులలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
-
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!