165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

Honor Magicpad 3 Pro

Honor Magicpad 3 Pro

Honor MagicPad 3 Pro Launched: హానర్ (Honor) నుండి కొత్త టాబ్లెట్ మ్యాజిక్ ప్యాడ్ 3 ప్రో (MagicPad 3 Pro )ను అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది చైనాలో విడుదలైన 13.3 ఇంచ్ వెర్షన్‌కు ఇది కాంపాక్ట్ వేరియంట్‌గా విడుదలయ్యింది. స్క్రీన్ సైజ్ కొంచెం తగ్గినా.. డిస్‌ప్లే క్వాలిటీ, హ్యాండ్లింగ్‌లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త టాబ్లెట్‌లో 165Hz రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్‌ప్లే, బ్రైట్‌నెస్ 3,000 నిట్స్ ఉన్నాయి. OLED వల్ల డీప్ బ్లాక్స్, మంచి కాన్ట్రాస్ట్ లభిస్తాయి. అంతేకాకుండా 5,280Hz PWM డిమ్మింగ్ ఉండటంతో ఎక్కువసేపు ఉపయోగించినా కళ్లకు ఇబ్బంది తక్కువగా ఉంటుంది. 3.9mm సన్నని బెజెల్స్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

ఈ టాబ్లెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌పై నడుస్తుంది. దీని ద్వారా సాధారణ వినియోగం, వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్లో ఎలాంటి సమస్య ఉండదు. హెవీ గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ వంటి పనుల్లో మాత్రమే కాస్త తేడా కనిపిస్తుంది. గేమింగ్ కోసం సూపర్-రిజల్యూషన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. MagicPad 3 Pro కేవలం 4.8mm మందంతో, 450 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. కాస్త హ్యాండీగా ఉంటుంది. అయితే బ్యాటరీ సామర్థ్యం 10,100mAh మాత్రమే ఉంది. సాధారణ వినియోగానికి ఇది సరిపోతుంది, కానీ హెవీ యూజర్లకు కొంత పరిమితిగా అనిపించవచ్చు.

ఈ టాబ్లెట్‌ను కేవలం ఎంటర్టైన్మెంట్‌కే కాకుండా పనుల కోసం కూడా ఉపయోగించవచ్చు. PC మోడ్, ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కీబోర్డ్ ఫోలియో యాక్సెసరీ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. చైనాలో ఇప్పటికే ఈ టాబ్లెట్ అమ్మకానికి అందుబాటులో ఉంది. 8GB + 256GB వేరియంట్ ధర CNY 3,999 (సుమారు $585)గా ఉండగా, 16GB + 512GB వేరియంట్ ధర CNY 5,699గా నిర్ణయించారు. ప్రస్తుతం గ్లోబల్ లాంచ్‌పై ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న MagicPad 4తో ఈ మోడల్ హార్డ్‌వేర్ పరంగా చాలా దగ్గరగా ఉంటుంది.