Honor Magic 9: హానర్ (Honor) కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ హానర్ మ్యాజిక్ 9 (Honor Magic 9)ను త్వరలో చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ప్రస్తుతం మ్యాజిక్ 9 సిరీస్‌ను మాత్రమే ప్రస్తావించినప్పటికీ.. ఇందులో స్టాండర్డ్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మోడళ్లు ఉండే అవకాశం ఉంది. ఇవి గతేడాది విడుదలైన హానర్ మ్యాజిక్ 8, మ్యాజిక్ 8 ప్రో కు సక్సెసర్లుగా రానున్నాయి.
హానర్ ఇప్పటికే చైనాలో మ్యాజిక్ 9 సిరీస్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్స్, ప్రీ-ఆర్డర్లను కూడా ప్రారంభించింది. ఈ కొత్త సిరీస్‌లో కెమెరా విభాగంపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనపడుతోంది. ప్రముఖ జర్మన్ ఫిల్మ్ ఎక్విప్‌మెంట్ బ్రాండ్ అర్రి ‘Arri’ భాగస్వామ్యంతో కెమెరా సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, హానర్ అధికారికంగా లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే లీకుల ప్రకారం మ్యాజిక్ 9 సిరీస్ సెప్టెంబర్ 28న చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో 200MP మెయిన్ కెమెరాను అందించనున్నట్లు సమాచారం. ఇందులో 1/1.28-అంగుళాల సెన్సార్, f/1.57 అపెర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇక ఫోన్ కెమెరా సెటప్‌లో మరో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది. ఇది 1/1.4-అంగుళాల సెన్సార్, f/2.6 అపెర్చర్‌తో పనిచేస్తుందని సమాచారం. Arri ఇమేజింగ్ టెక్నాలజీతో కలిసి ఈ కెమెరా సిస్టమ్ పనిచేయనున్నట్లు లీక్‌లు తెలుపుతున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా కూడా Magic 9 సిరీస్ కీలక అప్‌గ్రేడ్‌ను పొందనుంది. ఈ సిరీస్‌లో Snapdragon 8 Elite Gen 6 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ చిప్‌సెట్‌తో మార్కెట్లోకి వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్‌లలో Magic 9 సిరీస్ కూడా నిలవనుంది.
బ్యాటరీ విషయంలో కూడా హానర్ భారీ కెపాసిటీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Magic 9 సిరీస్‌లో 8,000mAh బ్యాటరీ ఉండవచ్చని కొన్ని లీక్‌లు సూచిస్తున్నాయి. అదేవిధంగా అధికారిక స్టైలస్ యాక్సెసరీతో పాటు పలు AI ఆధారిత ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా హానర్ సొంత ‘Yoyo AI’ అసిస్టెంట్ ఈ సిరీస్‌లో అందుబాటులో ఉండనుంది. డిస్‌ప్లే పరంగా స్టాండర్డ్ Honor Magic 9లో 6.36-అంగుళాల స్క్రీన్ ఉండవచ్చని సమాచారం. ఫోన్ వెనుక భాగంలో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను చూపించే టీజర్లను కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది.
Honor Magic 9 సిరీస్ ప్రస్తుతం చైనాలోని హానర్ మాల్ ద్వారా ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. “డేర్ టు థింక్ డిఫరెంట్లీ” అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ఈ కొత్త సిరీస్‌ను ప్రమోట్ చేస్తోంది. ఈ మోడళ్లలో గరిష్టంగా 16GB RAM, 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

