Honor 700 Series: హానర్ (Honor) త్వరలో చైనా మార్కెట్లో తన కొత్త Honor 700 సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో Honor 700, Honor 700 Pro మోడళ్లను తీసుకురానున్నట్లు సమాచారం. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్లలో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్లను అందించనున్నారు. Honor 700 స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను అందించనున్నట్లు సమాచారం. ఇక ప్రీమియం మోడల్ Honor 700 Proలో మరింత శక్తివంతమైన Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ ఉండనుంది.
కెమెరా విభాగంలో కూడా ఈ సిరీస్ ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇందులో 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను అందించనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. Honor 700 Proలో అదనంగా 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా రెండు మోడళ్లలోనూ 200mm టెలిఫోటో ఎక్స్టెండర్కు సపోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. బ్యాటరీ విషయంలో హానర్ కొత్త రికార్డు సృష్టించేలా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లోని ఫోన్లకు సుమారు 9000mAh సామర్థ్యంతో కూడిన భారీ బ్యాటరీలను అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రో మోడల్లో 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. ఇక 3C సర్టిఫికేషన్ ప్రకారం మూడు మోడళ్లకు 80W వరకు వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది.
హానర్ 700 సిరీస్‌లో 6.57 ఇంచుల 1.5K OLED డిస్ప్లేను అందించవచ్చని సమాచారం. ఫోన్ వెనుక భాగంలో 1.72 ఇంచుల సెకండరీ డిస్ప్లే కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. Honor 700 సిరీస్‌ను 2026 నవంబర్లోనే చైనా మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో Oppo Reno 17, Vivo S70 సిరీస్‌లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ధర, పూర్తి స్పెసిఫికేషన్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

