Site icon NTV Telugu

రూ.3,999కే టచ్ అండ్ గో డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ అనుభవం ఇచ్చే HMD Touch 4G లాంచ్!

Hmd

Hmd

HMD Touch 4G: HMD గ్లోబల్ భారత మార్కెట్‌లో ఓ సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. ఫీచర్ ఫోన్ అనుభవం, స్మార్ట్‌ఫోన్ ఆధునికతను కలగలిపి “మొదటి హైబ్రిడ్ ఫోన్”గా HMD Touch 4Gని అధికారికంగా విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో టచ్ ఫీచర్లు, మరిన్ని అద్భుత ఫీచర్లతో ఈ మొబైల్ లాంచ్ అయ్యింది. HMD Touch 4G ఫోన్‌ను కేవలం మాట్లాడటానికి మాత్రమే కాకుండా, కొద్దిమేర స్మార్ట్‌ఫోన్ అనుభూతిని ఇవ్వడానికి రూపొందించారు.

ఈ కొత్త HMD Touch 4G మొబైల్ 3.2 ఇంచుల QVGA టచ్ డిస్‌ప్లే (2.5D కవర్ గ్లాస్‌తో) కలిగి ఉంది. బటన్‌ల ఫీచర్ ఫోన్లకు భిన్నంగా, టచ్ ద్వారా ఆపరేట్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. అలాగే ఇందులో Unisoc T127 చిప్‌సెట్, 64MB ర్యామ్, 128MB స్టోరేజ్‌తో వస్తుంది. ముఖ్యంగా 32GB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండడం స్టోరేజ్ సమస్యను తీరుస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా S30+ Touch UI పై నడుస్తుంది. దీనిలో ఉండే Cloud Apps Suite ద్వారా యూజర్లు డైరెక్ట్‌గా వీడియోలు, సోషల్, యూటిలిటీ యాప్‌లను స్ట్రీమ్ చేయవచ్చు. క్రికెట్ స్కోర్లు, వార్తలు, వాతావరణ అప్‌డేట్స్, HTML5 గేమ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి.

Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ.. పవన్‌ కల్యాణ్‌ సూచనలతో ఉత్తర్వులు..

ఈ ఫోన్‌లో అత్యంత ప్రత్యేకమైన, ఉపయోగకరమైన ఫీచర్ గా Quick-Call Button (ICE – In Case of Emergency key)గా చెప్పవచ్చు. ఇది ఆపద సమయాల్లో ఈ బటన్‌ను మూడుసార్లు క్లిక్ చేయడం లేదా ఎక్కువసేపు నొక్కి ఉంచడం ద్వారా అత్యవసర సహాయాన్ని కోరవచ్చు. అలాగే ఇందులో 4G LTE, VoLTE తో పాటు Wi-Fi 802.11, Bluetooth 5.0, GPS, USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

HMD Touch 4G మొబైల్ ఆండ్రాయిడ్, iOS యూజర్లతో టెక్స్ట్, వీడియో కాల్స్ చేయడానికి ఉపయోగపడే Express Chat యాప్ దీనిలో లభిస్తుంది. ఇక కెమెరా విభాగంలో ఫోటోగ్రఫీ కోసం 2MP రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 0.3MP VGA ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక మరోవైపు దీనిలో 2,000mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఇది ఒక్క ఛార్జ్‌పై ఏకంగా 30 గంటల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు ఈ ఫోన్‌కు IP52 రేటింగ్ కూడా ఉంది. అంటే దుమ్ము మరియు నీటి తుంపరల నుండి దీనికి రక్షణ లభిస్తుంది. దీని ధర కేవలం రూ.3,999 మాత్రమే. ఈ మొబైల్ సియాన్, డార్క్ బ్లూ రంగులలో లభ్యమవుతుంది. ఇది ప్రస్తుతం HMD ఇండియా వెబ్‌సైట్లో, త్వరలో ఈ-కామర్స్ సైట్లలో, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.

Minister Adluri Laxman: మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version