4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- డిస్ప్లే: 4K Ultra HD రిజల్యూషన్‌తో RGB MiniLED డిస్ప్లే
- స్క్రీన్ సైజులు: 55, 65, 75 అంగుళాల ఆప్షన్లు
- 2.1.2-ఛానల్ సరౌండ్ సౌండ్, 89W అవుట్‌పుట్, బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్, Dolby Atmos..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hisense UR8S MiniLED TV: హిసెన్స్ (Hisense) సంస్థ భారత మార్కెట్లో కొత్తగా UR8S RGB MiniLED TV సిరీస్ ను లాంచ్ చేసింది. RGB MiniLED టెక్నాలజీ, 4K రిజల్యూషన్, 180Hz రిఫ్రెష్ రేట్, 3,500 nits వరకు పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో ఈ టీవీ సిరీస్‌ను వచ్చేసింది. 55, 65, 75 అంగుళాల స్క్రీన్ సైజుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.
RGB MiniLED డిస్ప్లే:
హిసెన్స్ UR8S సిరీస్‌లో RGB MiniLED టెక్నాలజీని ఉపయోగించారు. Hi-View AI Engine RGB ద్వారా రంగులు, బ్రైట్నెస్, పిక్చర్ క్వాలిటీని రియల్ టైమ్‌లో ఆప్టిమైజ్ చేస్తుంది. అలాగే AI RGB Light Sensor పరిసరాల్లోని లైటింగ్ పరిస్థితులను గుర్తించి పిక్చర్ సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఈ టీవీలు 3840 × 2160 పిక్సెల్స్ 4K Ultra HD రిజల్యూషన్‌తో వస్తాయి. 3,500 nits వరకు పీక్ బ్రైట్నెస్, నేటివ్ 180Hz రిఫ్రెష్ రేట్, యాంటీ-రిఫ్లెక్షన్, గ్లేర్-ఫ్రీ టెక్నాలజీలు ఉన్నాయి.
Also Read
- iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
గేమింగ్‌కు అనుకూలంగా..
గేమింగ్ కోసం AMD FreeSync Premium Pro, VRR, ALLM వంటి ఫీచర్లను అందించారు. HDR10+ గేమింగ్, డాల్బీ విజన్ గేమింగ్, గేమ్ బార్ సపోర్ట్ కూడా ఉన్నాయి. దీంతో హై-ఫ్రేమ్-రేట్ గేమింగ్‌లో స్మూత్ విజువల్స్‌ను అందించేందుకు ఈ టీవీ ఉపయోగపడుతుంది. HDR విభాగంలో డాల్బీ విజన్ IQ, HDR10+, HDR10+ అడాప్టివ్, HLG, IMAX Enhanced వంటి ఫార్మాట్లకు సపోర్ట్ ఉంది. 55 అంగుళాల మోడల్ 5,000:1 కాంట్రాస్ట్ రేషియోను, 65 అంగుళాల మోడల్ 6,000:1 కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది.

డాల్బీ ఆటమ్స్ ఆడియో:
ఆడియో విషయానికి వస్తే.. ఇందులో 2.1.2-ఛానల్ మల్టీ-ఛానల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అందించారు. మొత్తం 89W స్పీకర్ అవుట్‌పుట్‌తో పాటు బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉన్నాయి.
VIDAA స్మార్ట్ టీవీ:
ఈ కొత్త సిరీస్ VIDAA TV ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో స్థానిక, అంతర్జాతీయ స్ట్రీమింగ్ సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. హాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్, VIDAA వాయిస్, బిల్ట్-ఇన్ అలెక్స వంటి వాయిస్ ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు గూగుల్ హోమ్, ఆపిల్ ఎయిర్ ప్లే, ఆపిల్ హోమ్ ఇంటిగ్రేషన్, ఎయిర్ ప్లే 2, స్క్రీన్ షేరింగ్, కంటెంట్ షేరింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
కనెక్టివిటీ:
కనెక్టివిటీ కోసం Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, ఈథర్నెట్, ఆప్టికల్ ఆడియో, CI+తో పాటు రెండు RF ట్యూనర్లను అందించారు. టీవీ డిజైన్ అల్ట్రా-స్లిమ్, బెజెల్-లెస్‌గా ఉంటుంది.
ధరలు:
భారత్‌లో Hisense UR8S RGB MiniLED TV సిరీస్ ధరలు రూ.1,19,990 నుంచి ప్రారంభమవుతాయి. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల స్క్రీన్ సైజుల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఈ టీవీలను వివిధ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లో భాగంగా రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్, రెండేళ్ల కాంప్రహెన్సివ్ వారంటీ, ఒక ఉచిత EMI, జీరో డౌన్ పేమెంట్, ఫిక్స్డ్ EMI ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది.
తాజావార్తలు
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!