NTV Telugu Site icon

Hero Vida Electric Scooter: హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర-ఫీచర్లు ఇవిగో!

Hero Vida Scooter Launch

Hero Vida Scooter Launch

Hero Vida Electric Scooter Launched In India: ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలు ఒకదానికి మించి మరొక ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా హీరో మోటోకార్ప్‌ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది. విడా వీ1 పేరిట తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. విడా వీ1 ప్లస్‌, విడా వీ1 ప్రో పేరిట రెండు వేరియెంట్లలో ఈ స్కూటర్‌ని తీసుకొచ్చారు. వీ1 ప్లస్‌ ధర రూ.1.45 లక్షలు కాగా.. వీ1 ప్రో ధరను రూ.1.59 లక్షలుగా కేటాయించారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఈ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని, డిసెంబర్ రెండో వారం నుంచి డెలివరీ స్టార్ట్ చేయనున్నామని ఈ కంపెనీ తెలిపింది. రూ. 2499 చెల్లించి, ఈ స్కూట్‌ని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు ఢిల్లీ , జైపూర్ నగరాల్లో దశల వారీగా వీటిని లాంచ్ చేయనున్నారు.

సింగిల్‌ ఛార్జ్‌తో విడా వీ1 ప్లస్ మోడల్‌ 143 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుందని.. విడా వీ1 ప్రో మోడల్‌ అయితే 165 కిలోమీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. రిమూవబుల్‌ బ్యాటరీ, పోర్టబుల్‌ ఛార్జర్‌తో ఈ స్కూటర్ వస్తోంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్స్‌ని ఇందులో ఉన్నాయి. ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయని సంస్థ పేర్కొంది. విడా వీ1 కేవలం స్కూటర్‌ మాత్రమే కాదని, ఈ సెగ్మెంట్‌లో ఓ పవర్‌ ఛేంజ్‌ కానుందని హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌, సీఈఓ పవన్‌ ముంజాల్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోనూ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించిన హీరో మోటోకార్ప్.. అమెరికాకు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్‌లో రూ.490 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆ కంపెనీతో కలిసి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్స్‌ రూపొందించాలని నిర్ణయించింది.

Show comments