NTV Telugu Site icon

Mobile Apps: ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉన్నాయా? అయితే ఇప్పుడే డిలీట్ చేయండి

Mobile Apps

Mobile Apps

యూజర్ల సమాచారాన్ని దోచుకుంటున్న యాప్స్‌ను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు గూగుల్ వాటిని నిషేధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయా యాప్స్ యూజర్ల ఫోన్‌లో ఉంటే వారి వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం గ్యారంటీ. దీంతో ప్రమాదకరమైన మాల్‌వేర్ యాప్‌లపై గూగుల్ నిషేధం విధిస్తుంది. తాజాగా మరో ఐదు డేంజర్ యాప్స్‌ను గూగుల్ గుర్తించింది. ఈ యాప్‌లు స్పైవేర్ యాప్‌లుగా పనిచేస్తూ యూజర్ల సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు గూగుల్ దృష్టికి వచ్చింది. అందుకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐదు యాప్‌లను గూగుల్ తొలగించింది. ఈ యాప్‌లు మీ మొబైల్‌లో ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాలని గూగుల్ సూచించింది. ఇలాంటి యాప్స్ ద్వారా వచ్చే లింక్స్ అసలు క్లిక్ చేయకూడదని.. మీ వ్యక్తిగత, బ్యాంకు సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్పించకూడదని గూగుల్ హెచ్చరించింది.

జోడి హారో స్కోప్( ZodiHoroscope): ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఈ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోకి ప్రవేశించిన మాల్‌వేర్‌ ఫేస్‌బుక్‌ ఖాతా వివరాలను తస్కరిస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. అందుకే తక్షణం ఈ యాప్‌ను తొలగించాలని ఆండ్రాయిడ్ యూజర్లను కోరింది.

పీఐపీ కెమెరా 2022 (PIP Camera 2022): ఈ యాప్‌ను ఇప్పటివరకు 50వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. సాధారణంగా యూజర్లు కెమెరాను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు ఈ యాప్‌ను వాడుతుంటారు. ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించగానే అందులోని మాల్‌వేర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లకు చేరవేస్తోంది. అందుకే ఈ యాప్‌ను వెంటనే డిలీట్ చేయండి

వైల్డ్‌ అండ్ ఎక్సోటిక్‌ యానిమల్‌ వాల్‌పేపర్ (Wild & Exotic Animal Wallpaper): ఈ యాప్‌ను ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లో మాస్క్వెరేడింగ్ అనే యాడ్‌వేర్ ఉంటుంది. ఇది మొబైల్‌లోని ఇతర యాప్‌ల ఐకాన్‌ను, పేరును మారుస్తుంది. దానివల్ల సమస్యలు వస్తున్నాయి. దీంతో ఈ యాప్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని గూగుల్ సూచించింది

పీఐపీ పిక్‌ కెమెరా ఫొటో ఎడిటర్‌ (PIP Pic Camera Photo Editor): ఈ యాప్‌ను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను ఇమేజ్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కోసం యూజర్లు వినియోగిస్తున్నారు. ఇందులోని మాల్‌వేర్‌ ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలను దొంగలిస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. దీంతో ఈ యాప్‌ను డిలీట్ చేయాలని యూజర్లను కోరింది.

మ్యాగ్నిఫిషర్‌ ప్లాష్‌లైట్‌ (Magnifier Flashlight): ఈ యాప్‌ను 10వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లో వీడియో, స్టాటిక్‌ బ్యానర్‌ యాడ్స్‌ ఎక్కువగా వస్తాయి. సైబర్‌ నేరగాళ్లు వీటి నుంచి యాడ్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపి డేటాను సేకరిస్తున్నారు. అందుకే ఈ యాప్‌ను కూడా మొబైల్ నుంచి తొలగించాలని గూగుల్ సూచించింది.