Google Pixel 10a: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గూగుల్ (Google) మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ లో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా Google Pixel 10aను అధికారికంగా సేల్స్ ను మొదలు పెట్టింది. గత నెలలో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు భారత వినియోగదారులకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. భారత్‌లో Pixel 10a ఒకే ఒక వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కలిగిన ఈ వేరియంట్ ధర రూ.49,999గా నిర్ణయించారు. బెర్రీ, ఫాగ్, లావెండర్, అబ్సిడియన్ వంటి రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను ఫ్లిప్కార్ట్, గూగుల్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Shiva Rajkumar: పబ్లిక్ ఈవెంట్లలో ‘అసభ్యకర జూమ్’ కల్చర్.. సప్తమి గౌడ పోరాటానికి శివన్న మద్దతు!
గూగుల్ పిక్సెల్ 10a కొనుగోలు చేసే వారికి గూగుల్ కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదేవిధంగా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.3,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అలాగే 24 నెలల వరకు వడ్డీ లేని నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఇక ఈ మొబైల్ కీలక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.3 అంగుళాల Actua pOLED డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇంకా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌కు గూగుల్ సొంత Tensor G4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. భద్రత కోసం Titan M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్ కూడా అందించారు. కెమెరా విభాగంలో వెనుకవైపు 48 MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో), 13 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 13 MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
Pink Ball Test: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సత్తా చాటుతుందా? నేటి నుంచే ఏకైక పింక్ బాల్ టెస్ట్!
ఇంకా ఇందులో 5,100mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే IP68 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి నుండి ఫోన్‌కు రక్షణ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్‌లో గూగుల్ అందిస్తున్న ప్రధాన ప్రత్యేకత దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్. 7 సంవత్సరాల వరకు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని గూగుల్ ప్రకటించింది.
