Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Old Smartphones: ఇంట్లో మూలనపడ్డ పాత స్మార్ట్ఫోన్లను పనికిరాని ఇ-వ్యర్థాలుగా (e-waste) భావించి తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే, త్వరలోనే ఇవి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కంప్యూటింగ్ వ్యవస్థలుగా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. పాత మొబైల్ ఫోన్లను తక్కువ కార్బన్ ఉద్గారాలను వెలువరించే ‘కంప్యూటింగ్ క్లస్టర్లుగా’ మార్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త వ్యూహాన్ని రెడీ చేస్తోంది. దీనికి సంబంధించిన సంచలన విషయాలు ఒక తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చాయి.
చిన్న సైజ్ ‘డేటా సెంటర్’గా పాత ఫోన్లు!
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు ప్లాన్ చాలా వినూత్నంగా ఉంది. పాత స్మార్ట్ఫోన్లలోని చిప్‌లు, మెమరీ, స్టోరేజ్‌లను సేకరించి.. వేలాది డివైజ్‌లను ఒకదానికొకటి అనుసంధానం చేయడమే గూగుల్ ప్రధాన లక్ష్యం. ఇలా వేలాది ఫోన్లను ఒక గొలుసుకట్టులా కలపడం ద్వారా ఒక చిన్న సైజ్ ‘డేటా సెంటర్’ను నిర్మిస్తారు. దీనిని భవిష్యత్తులో క్లౌడ్ అప్లికేషన్లు, పెద్ద పెద్ద పరిశోధన పనుల (Research Workloads) కోసం ఉపయోగించుకుంటారు. ఈ విప్లవాత్మక సాంకేతికతను అభివృద్ధి చేయడానికి గూగుల్ అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ పరిశోధన బృందంతో కలిసి పనిచేస్తోంది. వేలాది రిటైర్డ్ స్మార్ట్ఫోన్లను ఒక కొత్త రకమైన కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎలా మార్చవచ్చనే దానిపై ఈ ఉమ్మడి పరిశోధనలు సాగుతున్నాయి. అంతా సవ్యంగా జరిగితే, ఈ ప్రాజెక్ట్ కింద భవిష్యత్తులో సుమారు 2,000 పాత పిక్సెల్ (Pixel) స్మార్ట్ఫోన్లతో తయారు చేసిన ఒక నయా డేటా సెంటర్ అందుబాటులోకి రానుంది.
Also Read
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
ఈ ‘ఫోన్ క్లస్టర్ కంప్యూటింగ్’ ఎలా పనిచేస్తుందంటే..
గూగుల్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కు ‘ఫోన్ క్లస్టర్ కంప్యూటింగ్’ (Phone Cluster Computing) అని పేరు పెట్టింది. దీని పనితీరు ఇలా ఉండబోతోందని వెల్లడించింది. పరిశోధకులు ముందుగా ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, బయటి బాడీ వంటి భాగాలను తొలగిస్తారు. చివరకు ప్రొసెసర్, మెమరీ, స్టోరేజ్ ఉండే ‘మదర్బోర్డ్’ను మాత్రమే తీసుకుంటారు. ఇలా సేకరించిన అనేక స్మార్ట్ఫోన్ల మదర్‌బోర్డులను ఒకదానికొకటి అనుసంధానించి, వాటిపై ‘Linux’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇన్స్టాల్ చేస్తారు. ఈ పరికరాలన్నింటినీ కనెక్ట్ చేసిన తర్వాత, వీటిని అడ్వాన్స్డ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లా మేనేజ్ చేయడానికి ‘Kubernetes’ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తారు. కేవలం 25 నుంచి 50 స్మార్ట్ఫోన్ల సమూహం కలిస్తే.. కొన్ని ప్రత్యేక పనుల కోసం ఒక ఆధునిక సర్వర్‌తో సమానమైన కంప్యూటింగ్ శక్తిని ఉత్పత్తి చేయగలదట.
గూగుల్ అసలు ఉద్దేశం ఏంటంటే..
కంప్యూటింగ్ రంగానికి సంబంధించి కార్బన్ ఫుట్‌ప్రింట్ (కార్బన్ ఉద్గారాలు) ప్రధానంగా రెండు వనరుల నుంచి వస్తుందని గూగుల్ బలంగా నమ్ముతోంది. సిస్టమ్‌ను రన్ చేయడానికి నిరంతరం ఉపయోగించే విద్యుత్. కొత్త హార్డ్వేర్ల ఉత్పత్తి (Manufacturing) సమయంలో వెలువడే కాలుష్యం. అందుకే, పాత హ్యాండ్సెట్లను ఈ విధంగా రీసైకిల్ చేసి మళ్లీ వాడటం ద్వారా పర్యావరణానికి ముప్పుగా మారే కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించవచ్చని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం రీసెర్చ్ టీమ్ 2,000 స్మార్ట్ఫోన్ల క్లస్టర్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో క్లౌడ్ ఆధారిత సేవల్లో ఇదొక గేమ్ చేంజర్ కానుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?