Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్నెస్ ట్రాకర్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Fitbit Air: గూగుల్ తన ఫిట్నెస్ విభాగంలో ఓ వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌వాచ్ ఫీచర్ల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆరోగ్య మార్గదర్శకత్వానికే ప్రాధాన్యతనిస్తూ ‘ఫిట్‌బిట్ ఎయిర్’ (Fitbit Air) పేరుతో సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్‌ను పరిచయం చేసింది. దీంతో పాటు ‘గూగుల్ హెల్త్’ యాప్‌ను తయారు చేసింది. అంతేకాదు.. ‘AI హెల్త్ కోచ్’ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్వేర్ ఆధారిత ఆరోగ్య సాధనాలపై గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. సాధారణ ఫిట్నెస్ బ్యాండ్లకు భిన్నంగా ఫిట్‌బిట్ ఎయిర్ ఉంటుంది. ఇందులో ఎటువంటి స్క్రీన్, నోటిఫికేషన్లు లేదా గడియారం ఉండవు. ఇది కేవలం 12 గ్రాముల బరువుతో అత్యంత తేలికగా ఉంటుంది. దీని ధర 100 డాలర్లు (సుమారు రూ.8,300) కాగా, బాస్కెట్‌బాల్ దిగ్గజం స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ ధరను 130 డాలర్లుగా నిర్ణయించారు. వినియోగదారుడు పదేపదే స్క్రీన్ వైపు చూడకుండా, నిశ్శబ్దంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆరోగ్య డేటాను సేకరించడం దీని లక్ష్యం.
ఇది హృదయ స్పందన రేటు (Heart Rate), నిద్ర దశలు, స్లీప్ స్కోర్, గుండె లయలో మార్పుల (AFib alerts)ను ఇది పర్యవేక్షిస్తుంది. ఒత్తిడి స్థాయిలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే హెచ్ఆర్వీ (HRV) డేటాను సైతం ఇది అందిస్తుంది. నడక, రన్నింగ్, సైక్లింగ్, రోయింగ్ వంటి దాదాపు 140 రకాల వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. సేకరించిన డేటాను గూగుల్ జెమిని (Gemini) ఆధారిత AI విశ్లేషించి, వినియోగదారులకు వ్యక్తిగత ఫిట్నెస్ ప్లాన్లు, నిద్ర సూచనలను అందిస్తుంది. స్మార్ట్ వేక్ అలారం, సైలెంట్ వైబ్రేషన్ అలారం, రెడీనెస్ స్కోర్, కార్డియో లోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మునుపటి మోడళ్ల కంటే ఇది 15 శాతం ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందని గూగుల్ పేర్కొంది.
Also Read
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
- STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
- Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
ఇక, మే 19 నుంచి ప్రస్తుతం ఉన్న ఫిట్‌బిట్ యాప్ ఆటోమేటిక్‌గా ‘గూగుల్ హెల్త్’ యాప్‌గా అప్డేట్ అవుతుందని కంపెనీ వివరించింది. ఫిట్‌బిట్ వినియోగదారుల పాత డేటా అంతా ఇందులోకి మారుతుంది. ఈ కొత్త యాప్‌లో నాలుగు విభాగాలు (Today, Fitness, Sleep, Health) ఉంటాయి. ఇది వేరబుల్స్ డేటాతో పాటు ఆపిల్ హెల్త్, హెల్త్ కనెక్ట్, మెడికల్ రికార్డులను ఒకే చోట పొందుపరుస్తుంది. అలాగే, గూగుల్ హెల్త్ ప్రీమియం సభ్యుల కోసం ‘AI హెల్త్ కోచ్’ అందుబాటులోకి వస్తోంది. ఇది యూజర్ డేటాతో పాటు అప్లోడ్ చేసిన మెడికల్ రిపోర్టులు, ఫోటోలను విశ్లేషించి సరైన వర్కవుట్ ప్లాన్లు, రికవరీ సలహాలను ఇస్తుంది. ఫిట్‌బిట్ ఎయిర్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. మే 26 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. భారత్‌లో దీని విడుదలపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!