Google Fitbit Edge Launched: ఫిట్‌నెస్ ట్రాకర్ మార్కెట్లో గూగుల్ సరికొత్త ఫిట్ బిట్ ఎడ్జ్ (Fitbit Edge)ను ప్రకటించింది. స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్లు, స్మార్ట్‌వాచ్‌ల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేలా ఈ డివైజ్‌ను రూపొందించింది. “గూగుల్ హెల్త్ కోచ్” ఇంటిగ్రేషన్‌తో పాటు కలర్ AMOLED డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ GPS, ECG, SpO2, స్కిన్ టెంపరేచర్ సెన్సార్, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లను ఇందులో అందించింది. అంతేకాకుండా రిపేర్‌కు అనుకూలంగా మాడ్యులర్ ఇంటర్నల్ డిజైన్‌ను తీసుకొచ్చింది.
AMOLED డిస్‌ప్లే
ఈ డివైస్ లో 1.34 అంగుళాల (34mm) కలర్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. గత తరం Fitbit ట్రాకర్లతో పోలిస్తే 46% ఎక్కువ వ్యూయింగ్ ఏరియాను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టచ్ కంట్రోల్స్‌తో పాటు పక్క భాగంలో ఫిజికల్ మెకానికల్ బటన్ కూడా ఉంది. వర్కౌట్ సమయంలో ట్రాకింగ్‌ను పాజ్ చేయడం, తిరిగి ప్రారంభించడం వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ అల్యూమినియం బాడీతో వస్తుంది. 5 ATM, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి. దీంతో 50 మీటర్ల లోతు వరకు స్విమ్మింగ్ సమయంలోనూ ఉపయోగించవచ్చు.
40కి పైగా స్పోర్ట్స్ మోడ్స్
ఇందులో Ambiq AP5 మైక్రోకంట్రోలర్‌తో పాటు 64MB NOR ఫ్లాష్ స్టోరేజ్ అందించారు. నిమిషాల వారీ మోషన్ డేటాను ఏడు రోజుల వరకు, రోజువారీ మొత్తం యాక్టివిటీ డేటాను 30 రోజుల వరకు స్టోర్ చేయగలదు. ఇందులో GPS, Galileo సపోర్ట్ ఉండటంతో స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేయకుండానే రూట్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. అల్యూమినియం బాడీలో నానో-మోల్డెడ్ యాంటెన్నా ఇంటిగ్రేషన్ కారణంగా గత మోడళ్లతో పోలిస్తే లొకేషన్ అక్యురసీ 40 శాతం వరకు మెరుగుపడిందని గూగుల్ చెబుతోంది. 40కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ లభిస్తుంది. ఆటోమేటిక్ యాక్టివిటీ రికగ్నిషన్‌తో పాటు మాన్యువల్‌గా వర్కౌట్లను ట్రాక్ చేసుకోవచ్చు. ఆల్టీమీటర్ సహాయంతో ట్రయిల్ రన్స్, హిల్ వర్కౌట్స్, మెట్లు ఎక్కడం వంటి యాక్టివిటీల్లో ఎలివేషన్ మార్పులను గుర్తిస్తుంది.
ECG నుంచి SpO2 వరకు
Fitbit Edgeలో Optical PPG, ECG కోసం మల్టీపర్పస్ ఎలక్ట్రికల్ సెన్సార్, SpO2, స్కిన్ టెంపరేచర్, ఆల్టీమీటర్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ వంటి సెన్సార్లు ఉన్నాయి. PPG సెన్సార్ ద్వారా 24 గంటలూ హార్ట్ రేట్‌ను ట్రాక్ చేస్తుంది. హార్ట్ రేట్ అసాధారణంగా ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు అలర్ట్స్ అందిస్తుంది. ECG యాప్ ద్వారా అవసరమైనప్పుడు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ తీసుకోవడంతో పాటు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AFib) సంకేతాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ నోటిఫికేషన్లను కూడా అందిస్తుంది. నిద్ర సమయంలో స్లీప్ స్టేజెస్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ (SpO2), హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), స్కిన్ టెంపరేచర్ వంటి వివరాలను ట్రాక్ చేస్తుంది. Google Health యాప్‌లో దీర్ఘకాలిక ఆరోగ్య ధోరణులను విశ్లేషించే హెల్త్ గార్డియన్ ఫీచర్‌ను కూడా అందించారు.
5 నిమిషాల ఛార్జింగ్‌తో
ఇందులో 65mAh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కేవలం ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే ఒక రోజు సాధారణ వినియోగానికి సరిపడా పవర్ లభిస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. ప్రత్యేకంగా ఈ బ్యాటరీని రీప్లేస్ చేసుకునే విధంగా మాడ్యులర్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. దీంతో రిపేరబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చిన తొలి గూగుల్ Fitbit ఫిట్‌నెస్ ట్రాకర్‌గా Edge నిలుస్తోంది.
నోటిఫికేషన్లు కూడా..
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4 అందించారు. స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, అనుకూలమైన ప్లాట్‌ఫామ్‌లలో క్విక్ టెక్స్ట్ రిప్లైస్, మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్స్, అలారమ్స్, టైమర్స్, బేసిక్ గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 11 లేదా ఆ తర్వాతి వెర్షన్లు, iOS 16.4 లేదా ఆ తర్వాతి వెర్షన్లతో పనిచేస్తుంది. ఉపయోగించడానికి గూగుల్ అకౌంట్, గూగుల్ హెల్త్ యాప్ అవసరం.
ధర ఎంతంటే?
గూగుల్ ఫిట్ బిట్ ఎడ్జ్ ధర 179.99 డాలర్లు (సుమారు రూ.17,200)గా నిర్ణయించారు. దీనితో స్మాల్, లార్జ్ సైజుల్లో సిలికాన్ ఆక్టివ్ బాండ్స్ లభిస్తాయి. మాట్టే బ్లాక్ అల్యూమినియం ఒబిసిడియన్, శాటిన్ సిల్వర్ అల్యూమినియం ఫాగ్, సాటిన్ పీరైటె అల్యూమినియం ఆలివ్ , క్యాంపైన్ గోల్డ్-కాన్యోన్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే Stephen Curry Special Edition మోడల్‌ను 219.99 డాలర్లు (సుమారు రూ.21,025) ధరకు తీసుకొచ్చారు. ఇందులో Satin Pyrite Aluminum కేస్‌తో పాటు వాటర్-రెపెలెంట్ రీసైకిల్డ్ పాలిస్టర్ బ్యాండ్ ఉంటుంది. Fitbit Edge ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 27 నుంచి రిటైల్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులకు మూడు నెలల గూగుల్ హెల్త్ ప్రీమియం ట్రయల్ కూడా లభిస్తుంది.
Introducing Fitbit Edge, our next-generation health and fitness tracker. Featuring sleek design, a brilliant display, glanceable fitness guidance and advanced health tracking to support your wellness goals. It’s designed for both active lifestyles and everyday wear. https://t.co/DQj21AKSNQ
— Google (@Google) October 12, 2026

