Site icon NTV Telugu

Google AI Plus: రూ.199 ప్రారంభ ధరతో Google AI Plus.. పూర్తి వివరాలు ఇలా..!

Google Ai

Google Ai

Google AI Plus: గూగుల్ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ‘గూగుల్ AI ప్లస్’ (Google AI Plus) ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. సరసమైన ధరలో గూగుల్ అత్యాధునిక AI మోడల్స్, ఫీచర్లను వినియోగదారులకు అందించడమే ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రధాన లక్ష్యం. గూగుల్ AI ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో, వినియోగదారులు జెమినీ యాప్‌ (Gemini app) లో జెమినీ 3 ప్రో (Gemini 3 Pro) యాక్సెస్ పొందుతారు. అంతేకాకుండా ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ కోసం కొత్త సాధనాలైన నానో బనానా ప్రో (Nano Banana Pro), వీడియో క్రియేషన్, ఫ్లో వంటి అధునాతన ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు.

Local Body Elections : తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం..

ఈ ప్లాన్ ద్వారా జీమెయిల్ (Gmail), డాక్స్ (Docs) వంటి రోజువారీ యాప్‌లలోకి జెమినీని నేరుగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో మెరుగైన నోట్‌బుక్ ఎల్ఎమ్ (NotebookLM) సామర్థ్యాలు, 200GB షేర్డ్ స్టోరేజ్, గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యులతో పంచుకునే (Family-Sharing) సౌకర్యం కూడా లభిస్తుంది. భారతదేశంలో గూగుల్ AI ప్లస్ ధర నెలకు రూ. 399 గా నిర్ణయించబడింది. అయితే, కొత్త వినియోగదారుల కోసం మొదటి ఆరు నెలల వరకు పరిచయ ఆఫర్‌గా కేవలం నెలకు రూ. 199 చొప్పున లభిస్తుంది.

Pinaka Mk4 Missile: ఇక ఇస్లామాబాద్ వణకాల్సిందే – కరాచీ దద్దరిల్లాల్సిందే.. భారత ఆయుధామా మజకా

గూగుల్ AI ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో ఈ కింది ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి:

* జెమినీ 3 ప్రోకి విస్తరించిన యాక్సెస్: గూగుల్ సంబంధించిన అత్యంత సమర్థవంతమైన మోడల్ అయిన జెమినీ 3 ప్రోకి జెమినీ యాప్‌లో పూర్తి యాక్సెస్ లభిస్తుంది.

* నానో బనానా ప్రో యాక్సెస్: ఇటీవల గూగుల్ ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ మోడల్ అయిన నానో బనానా ప్రోకి పూర్తి యాక్సెస్ లభిస్తుంది.

* వీడియో జనరేషన్: జెమినీ యాప్‌లో ఫ్లో వంటి వీడియో క్రియేషన్, సృజనాత్మక సూట్‌లకు యాక్సెస్ లభిస్తుంది.

* యాప్ ఇంటిగ్రేషన్: జీమెయిల్, డాక్స్ ఇంకా ఇతర రోజువారీ యాప్‌లలో జెమినీని సజావుగా అనుసంధానించడం జరుగుతుంది.

* మెరుగైన నోట్‌బుక్ఎల్‌ఎమ్: అధునాతన పరిశోధన, అంతర్దృష్టుల కోసం నోట్‌బుక్ఎల్‌ఎమ్ మెరుగైన సామర్థ్యాలు లభిస్తాయి.

* క్లౌడ్ స్టోరేజ్: ఫోటోలు, డ్రైవ్, జీమెయిల్ అంతటా పంచుకోగలిగే 200GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది.

* ఫ్యామిలీ షేరింగ్: ఈ ప్లాన్ ద్వారా వచ్చే ప్రయోజనాలను ఐదుగురు కుటుంబ సభ్యుల వరకు పంచుకోవచ్చు.

Exit mobile version