Smartphone: నిజంగా కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు వాడే ఫోన్‌లో బంగారం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. వాస్తవానికి ఫోన్‌ను “స్మార్ట్‌గా” చేసేవి ఫీచర్లు, సాఫ్ట్‌వేర్‌లు మాత్రమే కాదు, లోహాలు కూడా.. ఫోన్‌ను నాజూకుగా, బలంగా, తేలికగా ఉంచడంలో ఈ లోహాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఏ లోహాలను ఎలా ఉపయోగిస్తారో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
READ ALSO: Anil Ravipudi: వరుసగా 9 హిట్లు.. 10వ సినిమాపై అనిల్ రావిపూడి సెన్సేషనల్ అప్‌డేట్!”
మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు, అది తేలికగా అనిపిస్తుంది. మీ ఫోన్ ఎందుకు బరువుగా అనిపించడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం.. మెగ్నీషియం, అల్యూమినియం.. ఈ రెండు లోహాలు మీ ఫోన్‌ను తేలికగా ఉంచడంలో విశేషంగా సహాయపడుతుంది. అల్యూమినియం ఫ్రేమ్ హ్యాండ్‌సెట్‌ను బలపరుస్తుంది, మెగ్నీషియం ఫోన్‌ను తేలికగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఫోన్‌లో స్టీల్‌ను అంతర్గతంగా, స్క్రూల కోసం ఉపయోగిస్తారు. అలాగే ఫోన్‌లో ఉపయోగించే సర్క్యూట్ బోర్డ్ రాగితో తయారు చేస్తారు. ఇందులో బంగారం, వెండి యొక్క పలుచని పొరను కూడా ఉపయోగిస్తారు. బంగారం అనేది ఫోన్‌కు తుప్పును నిరోధిస్తుంది, కాబట్టి దీనిని యూజ్ చేస్తారు. మీ ఫోన్ బ్యాటరీలో ప్రధాన లోహంగా లిథియం ఉంటుంది. అలాగే మీ ఫోన్ స్పీకర్లలో ఏ లోహాన్ని యూజ్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. నియోడైమియం. నిజానికి ఇది చిన్న అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించే లోహం. దీనిని స్పీకర్లు, వైబ్రేషన్ మోటార్లలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్‌లో సుమారు 0.02 గ్రాముల నుంచి 0.034 గ్రాముల వరకు బంగారం ఉంటుంది. ఈ బంగారం ఫోన్ సర్క్యూట్ బోర్డులు, పిన్‌లు, కనెక్టర్లలో ఉంటుంది.
READ ALSO: Komati Reddy Venkat Reddy: మా టార్గెట్ ఇదే.. ప్రభుత్వ విజన్‌పై మంత్రి కోమటిరెడ్డి వివరణ..
