చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. పీ సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ పీ4ఎక్స్’ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాగా.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రియల్‌మీ యూఐ 6.0తో పనిచేసే ఈ ఫోన్.. 50MP ప్రైమరీ కెమెరాతో వచ్చింది. డిసెంబర్ 4న లాంచ్ అయిన రియల్‌మీ పీ4ఎక్స్‌పై లాంచ్ ఆఫర్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
రియల్‌మీ పీ4ఎక్స్ ఫోన్ రూ.15,000 ప్రారంభ ధరకు విడుదల అయింది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999గా ఉండగా.. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ మూడు రంగు ఎంపికలలో (మ్యాటీ సిల్వర్, ఎలెగెంట్ పింక్, లేక్ గ్రీన్) లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ నుంచి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ లాంచ్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ ఉన్నాయి.
రియల్‌మీ పీ4ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌పై లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ.1,000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు రూ.1,500 బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తోంది. డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ తర్వాత ఫోన్ రూ.13,499కి మీ సొంతం అవుతుంది. ఈ ఫోన్ డిసెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. లాంచ్ ఆఫర్ కాబట్టి కొన్ని రోజులే ఉండనుంది. రియల్‌మీ పీ4ఎక్స్ కొనాలనుకునేరు వెంటనే కొనేసుకుంటే బెటర్.
Also Read: Arshdeep Singh: అర్ష్‌దీప్ గణాంకాలు సూపర్.. అవకాశాలు ఇస్తే మూడో ప్రధాన పేసరే!
రియల్‌మీ పీ4ఎక్స్ ఫీచర్స్:
# 6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే
# 144Hz రిఫ్రెష్ రేటు, 1000 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్
# మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్
# రియల్‌మీ యూఐ 6.0
# 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా
# 8MP ఫ్రంట్ కెమెరా
# 45W ఛార్జింగ్ సపోర్ట్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ
# IP64 రేటింగ్
