NTV Telugu Site icon

Whatsapp: వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోండి..

Whatsaap

Whatsaap

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్లు ఉండరు.. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ను వాడుతున్నారు.. అందులో ప్రతి ఒక్కరు వాట్సాప్ ఎక్కువగా వాడుతుంటారు.. వాట్సాప్ ఈజీగా మనం ఫొటోస్ వీడియోస్ వంటివి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ని దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు.. అయితే వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో అనేది ఎలా తెలుసుకోవచ్చునో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్ లో అనేక కొత్త ఫీచర్స్ వస్తూనే ఉన్నాయి.. అవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ తో పాటుగా సెక్యూరిటీని కూడా అందిస్తున్నాయి.. దాంతో ఎక్కువ మంది వాట్సాప్ ను వాడుతుంటారు.. ఫోటో పంపించాలన్న వీడియో పంపించాలన్న లేదంటే ఏమైనా డాక్యుమెంట్స్ వంటివి పంపించాలన్న వాట్సాప్ ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి..

ఒక్కోసారి మనం చాలా మందికి చాలా సార్లు మెసేజ్ లు పంపిస్తాము.. అయితే కొన్ని సార్లు రిప్లై రాదు.. లేదా డెలివరీ అయినట్లు రెండు టిక్స్ రావు.. దీంతో బ్లాక్ చేశారేమో అని అనుమానం వస్తుంది.. అయితే బ్లాక్ చేశారని ఎలా తెలుసుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు ఎవరైనా ప్రొఫైల్ ను ఎక్కువ కాలం చూడలేకపోతే బ్లాక్ చేశారని అర్థం. మీరు ఎవరి స్టేటస్ను ఎక్కువ కాలం చూడకపోతే మిమ్మల్ని బ్లాక్ చేశారు అని భావించాలి. ప్రొఫైల్ ఫోటో కూడా కనపడకపోయినట్లయితే బ్లాక్ చేసినట్లు అర్థం.. ఒక్కోసారి మెసేజ్ లు కూడా పోవు దాంతో మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్ధం.. ఇవి గుర్తుంచుకోని చెక్ చేసుకోండి..