Site icon NTV Telugu

Electric Scooter : రయ్‌..రయ్‌.. హైస్పీడ్‌ ఈ స్కూటర్లు వచ్చేశాయ్‌..

E Sctooters

E Sctooters

EVeium Cosmo, Comet, Czar E-Scooters Launched In India.

దేశంలో పెట్రోల్, డిజీల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే అందరూ ఎలక్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎలక్రిక్‌ స్యూటర్లు, బైక్‌ల వాడకం పెరుగుతూ వస్తోంది. పెట్రోల్‌ బైక్‌, స్కూటర్ల మాదిరిగా ఎలక్రిక్‌ స్కూటర్లు, బైక్‌లు పరుగులు తీయకపోవడం మినహా అన్నింట్లోనూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు సూపర్‌గానే ఉన్నాయి. అయితే పెట్రోల్‌ వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లను రయ్‌.. రయ్‌.. మంటూ పరిగెత్తిస్తామంటూ ముందుకు వచ్చింది ఈవీయం సంస్థ. ఈ సంస్థ తాజాగా మూడు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ఆధారిత మెటా4కి చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్‌ ఈవీయం పేరుతో కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. కాస్మో, కామెట్ , జార్ అనే పేరుతో వీటిని తీసుకొచ్చింది ఈవీయం. వీటి ధరలు వరుసగా(ఎక్స్-షోరూమ్) వరుసగా రూ. 1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, 2.16 లక్షలుగా ఈవీయం వెల్లడించింది. వీటి బుకింగ్‌లు ఆగస్టు 8 నుంచి మొదలు కానున్నట్లు ఈవీయం కంపెనీ పేర్కొంది. మూడు ఈ-స్కూటర్లు ఒకే 72V 31 Ah లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తితో పని చేస్తాయని కూడా ఈవీయం కంపెనీ తెలిపింది.

A Man With Two Gunmens : సామన్యుడికి ఇద్దరు గన్‌మెన్‌లు.. ఎందుకో తెలుసా..?

అయితే వీటి మైలేజీ, పరిధి, ఛార్జింగ్‌ టైం, ఎలక్ట్రిక్ మోటారు భిన్నంగా ఉంటాయని, కాస్మో, కామెట్ రెండూ 2000W ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చినప్పటికీ, టాప్-ఆఫ్-ది-లైన్ జార్ 4000W ఎలక్ట్రిక్ మోటారుతో వచ్చిందని ఈవీయం పేర్కొంది. జార్, కామెట్ రెండూ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 150 కి.మీ మైలేజీ వస్తాయని, అలాగే.. కాస్మో ఒకసారి ఛార్జ్‌ చేస్తే 80 కి.మీ మైలేజీ వరకు నడుస్తుందని ఈవీఎం వెల్లడించింది. ఈ స్కూటర్లు స్పీడ్ మోడ్‌లు (ఎకో, నార్మల్, స్పోర్ట్స్‌) లభ్యం కానున్నాయి. కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, లేటెస్ట్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రియల్ టైమ్ ట్రాఫికింగ్, ఓవర్-స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్, లొకేట్‌ మై వెహికల్ ఫీచర్లు ప్రధానంగా పొందిపరిచినట్లు ఈవీయం తెలిపింది. కాస్మో అతి తక్కువ వేగాన్ని గంటకు 65 కి.మీ, కామెట్, జార్ రెండూ గంటకు 85 కిలీమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. భారతీయ మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, తమ మూడు ఈ-స్కూటర్లు వినియోగదారుల మనసు దోచుకుంటాయని విశ్వసిస్తున్నామని కంపెనీ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ అన్నారు.

 

Exit mobile version