NTV Telugu Site icon

WhatsApp call Record : వాట్సాప్ కాల్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే..

Whatsapp Call Recording

Whatsapp Call Recording

WhatsApp call Record : ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp). తన వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ను తీసుకువస్తూ మరింత అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. వాట్సాప్ లో చాటింగ్ చేయడం, ఫోటోలను షేర్ చేయడం, వీడియోలను పంపించుకోవడం, లైవ్ లొకేషన్ ఇలాంటి అనేక ఫీచర్స్ ఉన్నప్పటికీ వాట్సప్ వాయిస్ కాల్ రికార్డు చేసుకునే అవకాశం మనకు కనిపించదు. అయితే వాట్సప్ కాల్స్ రికార్డు చేసుకోవడానికి మనం కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతాయి చాలు. దీంతో వాట్సప్ ఉపయోగిస్తున్న సమయంలో ఆడియో, వీడియో కాల్స్ కూడా మనం రికార్డు చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం మనం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు.

JC Prabhakar Reddy: కన్నీళ్లు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

ఈ సదుపాయం కోసం కేవలం వాట్సాప్ సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. దాంతో చాలా సులువుగా వాట్సప్ కాల్స్ ను రికార్డ్ చేసుకోవచ్చు. మరి అలా ఎలా చేసుకోవచ్చు ఒకసారి చూస్తే.. వాట్సప్ కాల్స్ రికార్డు చేసే సమయంలో ముందుగా స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ను ఆన్ చేసుకోవాలి. ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసే ముందే మీడియా మైక్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే మనం వాట్సప్ కాల్స్ ను రికార్డు చేసుకోవచ్చు. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే వీడియో కాల్స్ ని కూడా రికార్డు చేసుకోవచ్చు. అయితే ఇలా చేసిన వాయిస్ కాస్త క్లారిటీగా ఉండకపోవచ్చు. కాకపోతే ప్రాథమిక అవసరాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు అర్థమయ్యే విధానంలోనే వాయిస్ ఉంటుంది. అయితే ఈ పద్ధతిని దుర్వినియోగం చేసుకోకుండా ఉంటే చాలు.

Neeraj Chopra: మరోసారి గోల్డ్ మెడల్ దక్కించుకున్న నీర‌జ్ చోప్రా..

ఏదైనా కొన్ని సందర్భాలలో వీటి అవసరం కచ్చితంగా వస్తుంది. కాబట్టి కాల్స్ ను రికార్డ్ చేసుకోవడానికి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. అలాగే వాట్సప్ కాల్స్ రికార్డ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్లో “Call Recorder Cube ACR” అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వాడుకోవచ్చు. ఈ యాప్ వాట్సప్ తో లింక్ కావడంతో అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ వీడియో కాల్స్ అన్నిటిని కూడా ఆటోమేటిక్ గా రికార్డు చేస్తుంది. ఈ యాప్ వల్ల కేవలం వాట్సాప్ మాత్రమే కాకుండా ఫేస్బుక్, టెలిగ్రామ్, స్లాక్, సిగ్నల్, జూమ్ లాంటి అనేక యాప్స్ లో కూడా కాల్ రికార్డ్స్ చేసుకోవచ్చు.

Show comments