Site icon NTV Telugu

ప్రీమియమ్ డిజైన్, జియో ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీతో Cellecor 4K QLED టీవీలు లాంచ్..!

Cellecor 4k Qled

Cellecor 4k Qled

Cellecor 4K QLED: సెల్లీకార్ (Cellecor) గాడ్జెట్స్ లిమిటెడ్ భారత మార్కెట్‌లో కొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ టీవీలు జియోటెల్ OS‌తో పనిచేస్తూ జియో ఎకోసిస్టమ్‌తో అనుసంధానం కలిగి ఉంటాయి. అల్ట్రా స్లిమ్ అండ్ ఎడ్జ్‌లెస్ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌ను అందించే ఈ స్మార్ట్ టీవీలు మెరుగుపరిచిన దృశ్య నాణ్యత కోసం క్వాంటమ్ లూసెంట్ డిస్ప్లే (Quantum Lucent Display) టెక్నాలజీని ఉపయోగిస్తాయి. దీని వల్ల స్క్రీన్‌పై బ్రైట్‌నెస్ పెరిగి, కలర్ డెప్త్ మరింత రిచ్‌గా, కాంట్రాస్ట్ హైగా కనిపిస్తుంది. కొత్త సిరీస్ మొత్తం 55 అంగుళాలు (4K అల్ట్రా HD రిజల్యూషన్), 43 అంగుళాలు (Full HD రిజల్యూషన్), 32 అంగుళాలు (HD రిజల్యూషన్) మూడు స్క్రీన్ సైజ్‌లలో అందుబాటులో ఉంది. ప్రతి మోడల్‌లో కొత్త టెక్నాలజీ ఉపయోగించడం వల్ల స్పష్టత, రంగుల ప్రతిస్పందన మరింత మెరుగవుతుంది.

Realme P4x 5G Offers: కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్‌.. రూ.13,499కే సరికొత్త రియల్‌మీ పీ4ఎక్స్ ఫోన్!

సెల్లీకార్ జియో QLED స్మార్ట్ టీవీలు నెట్ఫ్లిక్, యూట్యూబ్, జియోహాట్స్టార్, జియోసావన్, జియో గేమ్స్, హలో జియో వంటి ప్రముఖ యాప్‌లను సపోర్ట్ చేస్తాయి. ఇతర OTT యాప్‌లను కూడా జియో స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీవీలు 2GB ర్యామ్, 8GB స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తాయి. కనెక్టివిటీ ఎంపికలలో మల్టిపుల్ HDMI, USB పోర్ట్స్ లభిస్తాయి. ఎంచుకున్న కొన్ని మోడళ్లలో వాయిస్ ఎనేబుల్‌డ్ బ్లూటూత్ స్మార్ట్ రిమోట్ కూడా అందిస్తున్నారు. అన్ని మోడళ్లలో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల స్పష్టమైన, థియేటర్ లాంటి సౌండ్ అనుభవం లభిస్తుంది.

Akhanda2Thaandavam : అఖండ 2 రిలీజ్ వాయిదా వేసినందుకు మమ్మల్ని క్షమించండి : 14 రీల్స్ ప్లస్

జియోటెలి OS ఈ సిరీస్‌ QLED టీవీలను మరింత స్మార్ట్‌గా, సులభంగా ఉపయోగించేలా రూపొందించబడింది. ఇందులో ఉన్న AI ఆధారిత కంటెంట్ సూచనలు వినియోగదారుల ఆసక్తుల ప్రకారం షోలు, సినిమాలను సిఫారసు చేస్తాయి. అంతేకాకుండా 400 కంటే ఎక్కువ ఉచిత TV ఛానల్స్‌ యాక్సెస్‌ను అందించడం ద్వారా వినోదాన్ని మరింత ఎక్కువగా చేస్తుంది. 4K ప్లేబ్యాక్ సపోర్ట్ ఉండటం వల్ల అధిక నాణ్యత గల కంటెంట్‌ను స్పష్టంగా ఆస్వాదించవచ్చు. కొత్త Cellecor Jio QLED స్మార్ట్ టీవీ సిరీస్ ఈ నెల నుంచే మార్కెట్లోకి రానుంది. వినియోగదారులు ఈ టీవీలను ప్రధాన రిటైల్ స్టోర్లలో, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మరియు సెల్లీకార్ ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.

Exit mobile version