POCO C85 5G: పోకో (POCO) నేడు భారత మార్కెట్‌లోకి తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ POCO C85 5G ను తీసుకురానుంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం.. ఈ ఫోన్ డిజైన్ Redmi 15C 5G మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అంటే ఇది ఒక రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యేలా ఉంది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ పెద్ద డిస్‌ప్లే ను అందిస్తున్నారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రీన్ మరింత స్మూత్‌గా స్పందించి గేమింగ్, వీడియోలు, స్క్రోలింగ్ వంటి పనులు మరింత చక్కగా పూర్తి అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లో MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ ఉంది. ఇది బడ్జెట్ విభాగంలో మంచి 5G పనితీరుతో పాటు ప్రతిరోజూ వినియోగానికి సరిపోయే వేగాన్ని అందిస్తుంది.
Chittoor: చిత్తూరు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. ఇప్పటికే 380కి పైగా..
కెమెరా సెగ్మెంట్‌లో కూడా పోకో మంచి స్పెసిఫికేషన్లను అందించింది. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. ఈ కాన్ఫిగరేషన్ బడ్జెట్ ఫోన్లలో సాధారణ వినియోగదారులకు మంచి ఫోటో క్వాలిటీని అందిస్తుంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణలలో ఒకటి 6000mAh భారీ బ్యాటరీ. దీన్ని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే చాలాసేపు నిరంతర వినియోగం పొందవచ్చు. భద్రత పరంగా, ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ అనంతరం ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుకు లభ్యం కానుంది. ధర వివరాలు, వేరియంట్లపై పూర్తి సమాచారాన్ని నేడు లాంచ్ సమయంలో ప్రకటించనున్నారు.
Shadnagar: షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో హత్యారాజకీయం..? అభ్యర్థి అనుమానాస్పద మృతి..
