BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..

  • BSNL రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌
  • అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ
  • సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీ.. ప్రస్తుతం మొత్తం 412 రోజుల వ్యాలిడిటీ
  • ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో
  • ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా
  • అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం..
Bsnl (1)

Bsnl (1)

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. దీర్ఘకాలికంగా ఉపయోగపడే రూ.2,399 వార్షిక ప్లాన్ వ్యాలిడిటీని తాత్కాలికంగా పెంచింది. సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీని అందించే ఈ ప్లాన్‌పై ఇప్పుడు మరో 47 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 రోజులకు చేరింది.

ఈ కొత్త ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఈ కాలంలో రూ.2,399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే సాధారణ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అదనంగా 47 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. డేటా పరంగా రోజుకు 2GB హై-స్పీడ్ డేటా అందుతుంది. రోజువారీ 2GB డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40Kbpsకు తగ్గుతుంది.

ఈ ప్లాన్ సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ప్రస్తుతం అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ కారణంగా మరో 47 రోజులు అదనంగా లభిస్తాయి. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 రోజులకు చేరుతుంది. 365 రోజుల సాధారణ వ్యాలిడిటీని పరిగణనలోకి తీసుకుంటే రూ.2,399 ప్లాన్‌కు రోజుకు సుమారు రూ.6.57 ఖర్చవుతుంది. అయితే ప్రస్తుత ఆఫర్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ పొందితే రోజువారీ ఖర్చు సుమారు రూ.5.82కు తగ్గుతుంది.

దీర్ఘకాలం ఉపయోగించాలనుకునే కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉండనుంది. ముఖ్యంగా తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏడాదికి పైగా కాలం పాటు కాలింగ్, SMS, డేటా సేవలను పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ అదనపు వ్యాలిడిటీ ఆఫర్‌ను తీసుకవచ్చారు. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 మధ్య రూ.2,399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రమే 47 రోజుల అదనపు వ్యాలిడిటీని పొందగలరు.