Site icon NTV Telugu

కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..!

Beston Qled Ultra Hd

Beston Qled Ultra Hd

BESTON QLED Ultra HD (4K) TV: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నవారికి బెస్టోన్ (BESTON) అదిరిపోయే ఆఫర్అందిస్తోంది. BESTON 140 సెం.మీ (55 అంగుళాల) QLED Ultra HD (4K) Smart Google టీవీ ఎడిషన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ 64% తగ్గింపుతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ.59,999 కాగా ప్రత్యేక ఆఫర్ కింద ఈ టీవీని కేవలం రూ. 21,599కే సొంతం చేసుకోవచ్చు.

TECNO Spark Go 3: IP64 రేటింగ్, లాంగ్ లైఫ్ పనితీరుతో జనవరి 16న వచ్చేస్తోంది..!

ఈ బెస్టోన్ టీవీ 3840 × 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 4K అల్ట్రా HD క్వాలిటీని అందిస్తుంది. QLED టెక్నాలజీ, వైడ్ కలర్ గామెట్, HDR-10 సపోర్ట్ వల్ల రంగులు మరింత బ్రైట్‌గా, క్లియర్‌గా కనిపిస్తాయి. పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. అలాగే టీవీలో ఉన్న 30W డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ ఆడియో టెక్నాలజీ స్పష్టమైన డైలాగ్స్‌, బ్యాలెన్స్‌డ్ సౌండ్‌ను ఇస్తాయి. మూవీ, మ్యూజిక్, స్పోర్ట్స్ ఏదైనా సరే మంచి ఆడియో అనుభూతిని అందిస్తుంది.

ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. నెట్ఫ్లిక్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్ స్టార్ వంటి యాప్స్‌కు డెడికేటెడ్ హాట్‌కీలు ఉన్న వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ కూడా ఇస్తారు. ఇక గూగుల్ అసిస్టెంట్, కిడ్స్ ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైల్, వాచ్ లిస్ట్ వంటి ఫీచర్లు ఫ్యామిలీ వినియోగానికి మరింత ఉపయోగపడతాయి.

GG W vs UPW W: ఉత్కంఠ మ్యాచులో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్..!

కనెక్టివిటీ పరంగా.. 3 HDMI పోర్ట్స్ (eARC సపోర్ట్‌తో), 2 USB పోర్ట్స్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0/5.1 ఉన్నాయి. ఇందులో 2GB RAM + 16GB స్టోరేజ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, గేమింగ్ కోసం ALLM సపోర్ట్ కూడా ఉంది. ఈ టీవీకి 2 సంవత్సరాల ఆన్‌సైట్ వారంటీ లభిస్తుంది. సెక్యూర్ డెలివరీ, ఇన్‌స్టాలేషన్ డెమో కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version