Republic Day Sale Deals: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నవారికి ఇది బెస్ట్ టైమ్ అనే చెప్పాలి.. పాత టీవీలకు స్వస్తి చెప్పే.. త్వరలోనే పెరగనున్న టీవీల ధర కంటే ముందే.. కొత్త టీవీ.. అది కూడా స్మార్ట్ టీవీలు ఇంటికి తెచ్చుకోవాలని చూసేవారికి ఇది అద్భుతమైన అవకాశం… ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రూ.6,000లోపే స్మార్ట్ టీవీలు లభించడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ ధర పరిధిలో టీవీలు చిన్న స్క్రీన్ సైజ్‌లలోనే లభిస్తున్నప్పటికీ, బెడ్‌రూమ్ లేదా చిన్న గదుల కోసం ఇవి మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి.
థామ్సన్ ఆల్ఫా స్మార్ట్ టీవీ
ఈ సేల్‌లో లభిస్తున్న చౌకైన స్మార్ట్ టీవీలలో థామ్సన్ ఆల్ఫా 24-అంగుళాల స్మార్ట్ టీవీ ఒకటి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టీవీ ధర రూ.5,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఇది రూ.6,299కి లిస్ట్ అయింది. చిన్న స్క్రీన్ అయినప్పటికీ, స్మార్ట్ ఫీచర్లతో మంచి విలువను అందిస్తోంది. అయితే, 24 అంగుళాల స్క్రీన్ చిన్నదిగా అనిపిస్తే, థామ్సన్ బ్రాండ్ నుంచే 32-అంగుళాల స్మార్ట్ టీవీని ఎంపిక చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం రూ.8,499 ధరకు లభిస్తోంది. ఇదే కాకుండా థామ్సన్ పెద్ద సైజ్ టీవీలపై కూడా సేల్‌లో మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ ఆఫర్లు
అమెజాన్‌లో VW 32-అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.7,499కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. అలాగే, కోడాక్ 32-అంగుళాల QLED స్మార్ట్ టీవీ కూడా సేల్‌లో ఉంది. దీని ధర రూ.8,499 కాగా, రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. QLED డిస్‌ప్లే కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.. ఇక, రూ.10,000 లోపు స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నవారికి Acer మరియు Black+Decker బ్రాండ్లు కూడా మంచి డీల్స్ అందిస్తున్నాయి.. Acer స్మార్ట్ టీవీ ధర రూ.9,999, Black+Decker స్మార్ట్ టీవీ ధర రూ.8,999గా ఉండగా.. ఈ టీవీలపై కూడా సుమారు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. అయతే, తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి ఈ రిపబ్లిక్ డే సేల్ మంచి అవకాశం. ముఖ్యంగా చిన్న గదులు, సెకండరీ టీవీ అవసరాల కోసం ఈ డీల్స్ బాగా ఉపయోగపడతాయి. పెద్ద స్క్రీన్, అధునాతన ఫీచర్లు కావాలంటే కొంచెం బడ్జెట్ పెంచుకోవాల్సి ఉంటుంది.
