Budget Smart TVs: ఈ రోజుల్లో కొన్ని వస్తువులు అనేవి ఇంట్లో కచ్చితంగా ఉండేవిగా మారాయి. అలాంటి వస్తువుల లీస్ట్‌లో ఫస్ట్ ప్లే్స్‌లో ఉండేది టీవీ. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ టీవీ అనేది ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుగా మారిపోయింది. మీరు కూడా తక్కువ ధరకు స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కచ్చితంగా ఈ స్టోరీ మీకోసమే. ఈ స్టోరీలో రూ.7 వేల కంటే తక్కువ ధర నుంచి టీవీల గురించి తెలుసుకుందాం. మీ బడ్జెట్ రూ.7 వేల నుంచి రూ.7,500 మధ్య ఉంటే మీకు 32-అంగుళాల HD-రెడీ LED టీవీ వస్తుంది. ఈ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న టీవీల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందా..
READ ALSO: Delhi Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసు, మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్..
స్మార్ట్ టీవీల బెస్ట్ ఛాయిస్..
* ఫాక్స్‌స్కీ HD-రెడీ LED టీవీ ఈ బడ్జెట్‌లో లభిస్తుంది. ఈ టీవీ ధర రూ.6,999. ఇది 32-అంగుళాల డిస్ప్లే, 30W సౌండ్ అవుట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఇది స్మార్ట్ టీవీ కాదు.
* మీరు స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే.. కూకా S4U ప్లస్ టీవీ బెస్ట్ ఛాయిస్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ 32-అంగుళాల స్క్రీన్ టీవీ కూలిటా ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇది 30W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. మీరు కూలింక్ యాప్‌ని ఉపయోగించి ఈ టీవీని వాయిస్ కంట్రోల్ కూడా చేయవచ్చు. ఈ టీవీ ధర రూ.6,999.
* థామ్సన్ HD రెడీ LED టీవీ కూడా ఈ బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. ఈ టీవీలో 20W సౌండ్ అవుట్‌పుట్‌తో 32-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ నుంచి ₹6,999కి కొనుగోలు చేయవచ్చు.
* ఫాక్స్‌స్కీ స్మార్ట్ టీవీ కూడా ఈ బడ్జెట్‌లోనే వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని కంపెనీ రూ.6,999కి అందిస్తోంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. అయితే ఈ టీవీని 2023లో లాంచ్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.
* KODAK టీవీ కూడా ఈ విభాగంలోనే వస్తుంది. కంపెనీ స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499 కు లభిస్తుంది. ఈ 32-అంగుళాల టీవీ 30W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. ఇది Linux TV OS పై నడుస్తుంది. దీనికి బ్యాంక్ ఆఫర్‌లను కూడా ఉన్నాయి.
READ ALSO: Betting Apps Case : సీఐడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రాణా..
