Long battery life smartphones in Budget: ఇదివరకు 5,000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఓ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్‌గా భావించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. బడ్జెట్, మిడ్‌రేంజ్ సెగ్మెంట్లలో 6,000mAh నుండి 7000mAh బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా 5G కనెక్టివిటీతో పాటు ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. రూ.15,000 లోపు భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ బ్యాటరీ లైఫ్ కలిగిన 5G స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ చూద్దామా..
Oppo K13x 5G:
Oppo K13x 5G బ్యాటరీ పరంగా బెస్ట్ ఛాయస్. ఇందులో 6,000mAh బ్యాటరీతో పాటు 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. 6.67 అంగుళాల LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో ఈ ఫోన్ వస్తుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్, గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్, 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. IP65 రేటింగ్‌తో పాటు MIL-STD 810-H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. ధర విషయానికి వస్తే.. 4GB+128GB వేరియంట్ రూ.11,999 నుంచి ప్రారంభమవుతుంది.
Redmi 15A 5G:
ఈ లిస్ట్ లో మరో ఫోన్ Redmi 15A 5G. ఇందులో కూడా 6,300mAh భారీ బ్యాటరీ అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ చెబుతోంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో వచ్చే ఈ ఫోన్‌కు నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు రెడ్ మీ ప్రకటించింది. 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, Unisoc T8300 5G ప్రాసెసర్, 32MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. ఇక ధర చూస్తే.. 4GB+64GB వేరియంట్ రూ.12,999, 4GB+128GB వేరియంట్ రూ.14,499గా ఉన్నాయి.
Samsung Galaxy F70e 5G:
రూ.15,000 లోపు సెగ్మెంట్‌లో Samsung Galaxy F70e 5G బెస్ట్ ఎంపికల్లో ఒకటి. ఈ ఫోన్‌లో 6,000mAh భారీ బ్యాటరీ అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8తో వచ్చే ఈ ఫోన్‌కు ఆరు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని శామ్‌సంగ్ హామీ ఇచ్చింది. ఇందులో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉన్నాయి. ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరా అందించారు. దీని ధర 4GB+128GB వేరియంట్ రూ.13,999, 6GB+128GB వేరియంట్ రూ.15,499 గా ఉన్నాయి.
Lava Bold N2 5G:
పెద్ద బ్యాటరీతో చవక ధరలో 5G ఫోన్ కోరుకునేవారికి Lava Bold N2 5G మంచి ఆప్షన్. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 815 నిమిషాల వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్, 743 నిమిషాల వరకు స్క్రీన్-ఆన్ టైమ్ అందుతుందని కంపెనీ చెబుతోంది. 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Unisoc T8200 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ వస్తుంది. 13MP ప్రధాన కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, IP64 రేటింగ్ కూడా ఇందులో ఉన్నాయి. దీని ధర 4GB+64GB వేరియంట్ రూ.12,999గా ఉంది.
Poco C85x 5G:
భారీ బ్యాటరీ బ్యాకప్ కోరుకునేవారికి Poco C85x 5G కూడా మంచి ఎంపికగా నిలుస్తుంది. ఇందులో 6,300mAh బ్యాటరీ ఉండగా, రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3, 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Unisoc T8300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 32MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, IP52 రేటింగ్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 4GB+64GB వేరియంట్ రూ.10,999, 4GB+128GB వేరియంట్ రూ.11,999 గా నిర్ణయించారు.
ఏ ఫోన్ బెస్ట్?
మీరు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, బ్రాండ్ విశ్వసనీయత కోరుకుంటే శామ్‌సంగ్ Galaxy F70e 5G మంచి ఎంపిక. ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూరబిలిటీ కావాలంటే ఒప్పో K13x 5Gను పరిశీలించవచ్చు. అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కోసం పోకో C85x 5G లేదా రెడ్ మీ 15A 5G సరైన ఎంపికలుగా నిలుస్తాయి. తక్కువ ధరలో బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు కావాలంటే లావా బోల్డ్ N2 5G కూడా మంచి ఆప్షన్.

