NTV Telugu Site icon

Polaris Dawn Astronaut: అంతరిక్షంలో వయోలిన్ వాయించిన వ్యోమగామి.. వీడియో వైరల్

Polaris Dawn Astronaut

Polaris Dawn Astronaut

ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ మిషన్ పొలారిస్ డాన్‌కు చెందిన వ్యోమగామి సారా గిల్లిస్ అంతరిక్షంలో వయోలిన్ ప్లే చేసి రికార్డు సృష్టించారు. పొలారిస్‌ డాన్‌ మిషన్‌ కమాండర్‌ జరేద్‌ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్‌ వాక్‌ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్‌ ప్రొఫెషనల్‌ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్‌ జూడ్‌ చిర్ర్డన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌ కూడా పాలుపంచుకుంది. ఇదిలా ఉండగా.. వ్యోమగామి సారా గిల్లిస్ అంతరిక్షంలో సంగీతం యొక్క రుచి మొదటిసారిగా ప్రపంచానికి చూయించారు. సారా గిల్లిస్ ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌లో ఇంజనీర్. సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమా ‘స్టార్‌వార్స్‌: ద ఫోర్సెస్‌ అవేకెన్స్‌’లోని ప్రఖ్యాత ‘రేస్‌ థీమ్‌’ను అంతరిక్షం నుంచే పర్‌ఫామ్‌ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్‌ రెసీలియన్స్‌’ పేరిట పొలారిస్‌ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

READ MORE: Nandyal: కూలిస్తే దూకి చస్తా.. ఇంటిపైకి ఎక్కి అధికారులను బెదిరించిన యజమాని

అంతరిక్షంలో ఆమె సంగీత కళ యొక్క ఈ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను చేసింది. అంతరిక్షంలో వయోలిన్ ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. పొలారిస్‌ డాన్‌ మిషన్‌ కమాండర్‌ జరేద్‌ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్‌ వాక్‌ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్‌ ప్రొఫెషనల్‌ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్‌ జూడ్‌ చి్రల్డన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌ కూడా పాలుపంచుకుంది. “విశ్వభాష అయిన సంగీతం ఈ వీడియోకు స్ఫూర్తి. బాలల్లో క్యాన్సర్‌ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం” అని పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది.

Show comments