iPhone 18 Pro Max: ఆపిల్ వచ్చే ఏడాది తీసుకురాబోయే ఫ్లాగ్‌షిప్ మోడల్ iPhone 18 Pro Max ఇప్పటికే టెక్ ప్రపంచంలో భారీ హాట్ టాపిక్‌గా మారింది. స్పెసిఫికేషన్లు, కెమెరా సిస్టమ్, డిజైన్.. ఇలా అన్ని విభాగాల్లో ఈ ఫోన్ ప్రీమియం, క్లాసీ అనుభూతిని అందిస్తుందని సమాచారం. అయితే, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ను భారత్‌లో 2026 సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అదే సమయంలో iPhone 18 Pro, iPhone Fold మోడళ్లను కూడా ఆపిల్ లాంచ్ చేయవచ్చని టాక్. ఇక, ఈ మొబైల్ ధర విషయానికి వస్తే, 256GB స్టోరేజ్ వేరియంట్ ధరతో రూ. 1,64,900గా ఉండొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి.
డిజైన్, డిస్‌ప్లే & కెమెరా
* iPhone 18 Pro Max డిజైన్ పరంగా గతంలో వచ్చిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లుక్‌ను కొనసాగించే అవకాశం ఉంది. కానీ, కొత్తగా ఒకటి లేదా రెండు న్యూ కలర్ ఆప్షన్లు అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.
కెమెరా విభాగంలో అప్‌గ్రేడ్
* 48MP ప్రైమరీ కెమెరా
* 48MP పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా
* 48MP అల్ట్రా వైడ్ కెమెరా.. మొత్తంగా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ రావొచ్చని టాక్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 24MP ఫ్రంట్ కెమెరా ఉండేలా కంపెనీ రూపొదించినట్లు తెలుస్తుంది.
Read Also: Rakul Preet Brother: టాలీవుడ్‌లో ప్రకంపనలు.. డ్రగ్స్ కేసులో మళ్ళీ ఇరుక్కున్న రకుల్ ప్రీత్ సోదరుడు
పెర్ఫార్మెన్స్ & ఇతర స్పెక్స్
* ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ డిస్‌ప్లేలో ప్రోమోషన్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే,
* 120Hz రిఫ్రెష్ రేట్ తో రావొచ్చు.. ఇది విజువల్స్‌ను మరింత స్మూత్, ప్రీమియంగా మార్చనుంది.
* ఆపిల్ A20 Pro చిప్‌సెట్
* 256GB స్టోరేజ్
* అప్‌గ్రేడ్ చేసిన సిరి (Siri) విత్ కొత్త ఫీచర్లు
* సిరి + iOS ఏఐ అప్‌డేట్స్
* కొత్త వెర్షన్ సిరి వాయిస్ అసిస్టెంట్.. ఈ ఫోన్‌లో సిరి లేటెస్ట్ అప్‌గ్రేడ్ వెర్షన్ కూడా అందించనున్నట్లు సమాచారం. అలాగే, iPhone 17 Pro Max మాదిరిగానే కనీసం 256GB స్టోరేజ్ను యాపిల్ కొనసాగించవచ్చని తెలుస్తుంది.
టాప్ ట్రెండింగ్ డివైస్
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రస్తుతం స్పెక్స్ లీక్స్ వల్లే కాకుండా.. రాబోయే iOS AI, Siri అప్‌గ్రేడ్‌లు, కెమెరా 48MP ట్రిపుల్ సెన్సార్లు, పెరిస్కోప్ జూమ్ లాంటి ఫీచర్ల కారణంగా సోషల్ మీడియా, టెక్ టాక్ వర్గాల్లో టాప్ ట్రెండింగ్ గా నిలుస్తోంది.
