Site icon NTV Telugu

Apple iPhone 16 Pro: త్వరలోనే లాంచ్ కానున్న ఐఫోన్ 16 ప్రో.. ఫీచర్స్ ఆన్లైన్లో లీక్..!

Apple 16 Pro

Apple 16 Pro

వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న ఎలెక్ట్రానిక్ కంపెనీ ఆపిల్ ఐఫోన్ గురించి తెలియని యువత ఉండరు.. ఈ కంపెనీ వస్తువుల గురించి తెలియగానే జనాలు వీటికోసం వెయిట్ చేస్తారు. అంటే అంతగా వీటికి డిమాండ్ ఉంటుంది.. అయితే ప్రస్తుతం iPhone 15 సిరీస్ గురించి టాక్ నడుస్తుంది.. ఆ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వలేదు.. కానీ, కొత్త ఐఫోన్ 16 సిరీస్ గురించి అనేక రుమర్లు వినిపిస్తున్నాయి.. అవేంటంటే..వచ్చే ఏడాది హై-ఎండ్ మోడల్‌లు కొత్త బ్యాక్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మోడళ్ల కెమెరా యూనిట్లలో ఆపిల్ కొత్త టైప్ సెన్సార్లను ప్యాక్ చేయగలదని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. సెన్సార్లు తక్కువ కాంతిలో మంచి ఫొటోలను తీయడానికి ఫోన్‌లను అనుమతిస్తాయి.

ఇదిలా ఉండగా.. వనిల్లా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కూడా కొత్త ఇమేజ్ సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు.. బ్లాగ్‌పోస్ట్‌లో ఆపిల్ ఐఫోన్(iPhone 16 Pro), iPhone 16 Pro Max మోడళ్లలో CIS డిజైన్‌ను అనుసరిస్తుందని పేర్కొన్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ల ఫొటోగ్రఫీ కోసం కెమెరా పిక్సెల్ లో మెరుగుపరుస్తుందని సమాచారం.. ఈ ఏడాది iPhone 15, iPhone 15 Plus కూడా 48MP వెనుక కెమెరాలతో కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఇమేజ్ సెన్సార్‌లతో రానుందని తెలుస్తుంది..

iPhone 16 సిరీస్ కొత్త బ్యాటరీ టెక్నాలజీతో వస్తుందని రుమర్లు వినిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ ప్రామాణిక బ్యాటరీలతో పోలిస్తే.. బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది iPhone యూనిట్లలో Apple 40W వైర్డు, 20W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ప్రవేశపెట్టవచ్చు..ఐఫోన్ 16 ప్రో మాక్స్ కూడా 300mm కన్నా ఎక్కువ ఫోకల్ లెంగ్త్‌తో సూపర్ టెలిఫోటో పెరిస్కోప్ జూమ్ కెమెరాతో వస్తుంది.. ఇక 15 సిరీస్ ఫోన్లను మాత్రం సెప్టెంబర్ 13న ప్రకటించవచ్చు. కొత్త లైనప్ ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్నాయని తెలుస్తుంది..

Exit mobile version