iPad Air (8th Gen) Launch: ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) ఐప్యాడ్ ఎయిర్ శ్రేణిలో కొత్తగా ఐప్యాడ్ ఎయిర్ (8th జెన్) (iPad Air (8th Gen))ను అధికారికంగా ప్రకటించింది. గతంలో విడుదలైన M3 వేరియంట్ కు అప్డేటెడ్ గా.. ఇప్పుడు మరింత శక్తివంతమైన M4 చిప్‌సెట్, అధిక ర్యామ్ సామర్థ్యం, అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లతో ఈ కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త ఐప్యాడ్ ఎయిర్‌లో ప్రధాన ఆకర్షణ M4 ప్రాసెసర్. 8 కోర్ CPU, 9 కోర్ GPU కలిగిన ఈ చిప్‌సెట్, గత M3 మోడల్ కంటే సుమారు 30% వేగంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే M1 మోడల్ తో పోలిస్తే 2.3 రెట్లు మెరుగైన పనితీరును అందిస్తుంది. 16 కోర్ న్యూరల్ ఇంజిన్ సపోర్ట్‌తో AI ఆధారిత టాస్క్‌లు మూడు రెట్లు వేగంగా పూర్తవుతాయి. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, గేమింగ్ వంటి హెవీ టాస్క్‌లకు ఇది అనుకూలంగా ఉంటుంది.
PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్
ఈసారి మెమరీ విభాగంలో ఆపిల్ పెద్ద మార్పు చేసింది. 12GB RAM అందించడం ద్వారా మల్టీటాస్కింగ్ మరింత సులభమైంది. పెద్ద యాప్‌లు, ప్రొఫెషనల్ టూల్స్ వినియోగంలో ల్యాగ్ లేకుండా పనితీరు అందుతుంది. డిస్‌ప్లే విషయంలో 11 అంగుళాలు, 13 అంగుళాల రెటినా ట్రూ టోన్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉండటంతో స్పష్టమైన విజువల్స్ లభిస్తాయి.
ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్ కోసం 12MP (f/1.8 అపర్చర్) రియర్ కెమెరాను అందించారు. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ముందుభాగంలో సెంటర్ స్టేజ్ ఫీచర్‌తో కూడిన 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. వీడియో కాల్స్ సమయంలో ఫ్రేమ్‌లో వ్యక్తిని ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది. కనెక్టివిటీ విభాగంలో కొత్త ‘N1’ వైర్‌లెస్ చిప్‌ను అమర్చారు. ఇది Wi-Fi 7, Bluetooth 6 సపోర్ట్ అందిస్తుంది. సెల్యులార్ వేరియంట్లు 5G, eSIM సదుపాయాలతో వస్తాయి.
IND vs ENG T20 WC Stats: భారత్ vs ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్.. టీ20 వరల్డ్ కప్‌లో ఎవరిది పైచేయి?
సుమారు 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగల సామర్థ్యం ఈ ఐప్యాడ్ ఎయిర్‌కు ఉంది. Touch ID ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ కోసం ఇది సమర్థవంతమైన ఎంపికగా నిలుస్తుంది. భారత మార్కెట్లో iPad Air (8th Gen) ప్రారంభ ధర రూ. 64,900గా నిర్ణయించారు. 128GB, 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది బ్లూ, పర్పుల్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
