ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో యాపిల్ మొబైల్ ఫోన్లే రారాజు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌లకు ప్రత్యేక అభిమానుల సంఖ్య కారణంగా., ప్రజలకు వాటి పట్ల ఉన్న ఉత్సాహం అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న పాపులారిటీకి తగ్గట్టుగా యాపిల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ మధ్యకాలంలో పలువురిని ఆకర్షిస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఫోన్లపై కూడా దృష్టి సారించింది. ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఫోల్డబుల్ ఫోన్‌లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆపిల్ ఇలాంటి చర్యలు తీసుకుంటోందని నిపుణులు అంటున్నారు. ఆపిల్ 2027లో ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేయనుంది. శామ్‌సంగ్, వన్ ప్లస్, వివో లాంటి బ్రాండ్ లకు పోటీగా ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేయనుంది.
Youngest MP: ఇండియాలో అతిపిన్న వయస్సు గల ఎంపీ ఎవరో తెలుసా..?
అయితే 2027కి ముందు ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసే అవకాశం లేదని ఆపిల్ కంపెనీ పేర్కొంది. ఆపిల్ ఇంకా ఫీచర్లు, కాంపోనెంట్‌ల పనితీరును అంచనా వేస్తోంది. ఫోల్డబుల్ డిస్‌ప్లేల సరఫరాతో సహా వివిధ ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆపిల్ తన ఫోల్డబుల్ ఐఫోన్ కోసం లాంచ్ షెడ్యూల్‌ను 2026 నాల్గవ త్రైమాసికం నుండి 2027 మొదటి త్రైమాసికం వరకు వెళ్లిందని కంపెనీ తెలిపింది. 2022లో 80% మార్కెట్ వాటాతో, వివిధ బ్రాండ్‌ల నుండి పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటున్నప్పుడు శామ్‌సంగ్ ఇప్పుడు తన 50% మార్కెట్ వాటాను కొనసాగించడానికి కష్టపడుతోంది.
ICC T20 World Cup: పాకిస్తాన్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
ఆపిల్ కనీసం 2 క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ మోడల్స్ ప్రోటోటైప్‌లపై పని చేస్తోంది. అలాగే సరఫరా ఆర్డర్‌ల కోసం LG డిస్‌ప్లే, శామ్‌సంగ్ డిస్ప్లేతో చర్చలు జరుపనుంచి. ఫోల్డబుల్ డిస్‌ప్లేల కోసం కంపెనీ పేటెంట్‌లను దాఖలు చేసింది. బ్రాండ్ యొక్క మొదటి ఫోల్డబుల్ ఫోన్ 6-అంగుళాల డిస్‌ప్లే, 8-అంగుళాల ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.